ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోక్యో ఒలింపిక్స్‌లో సోమవారం భారత్ షెడ్యూల్ ఇదే

ABN, First Publish Date - 2021-08-02T07:04:53+05:30

టోక్యో ఒలింపిక్స్ మరో వారంలో ముగియనున్నాయి. ఇప్పటివరకు భారత్ కేవలం రెండు పతాకాలే నెగ్గింది. వెయిట్ లిఫ్టింగ్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో ఒలింపిక్స్ మరో వారంలో ముగియనున్నాయి. ఇప్పటివరకు భారత్ కేవలం రెండు పతాకాలే నెగ్గింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను తొలి పతకం(రజతం) నెగ్గగా.. ఆదివారం షట్లర్ పీవీ సింధు కాంస్యం నెగ్గింది. ఇక సోమవారం మరికొందరు భారత ఆటగాళ్లు పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 200 మీటర్ల హీట్ 1 మహిళల పోటీల్లో స్నైపర్ ద్యుతీ చంద్ పాల్గొననుంది. ఈ పోటీలు ఉదయం 7.24 గంటలకు(భారత కాలమానం ప్రకారం) జరగనున్నాయి. 


అలాగే షూటర్లు ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, సంజీవ్ రాజ్‌పుత్‌లు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ మెన్స్ క్వాలిఫయర్స్‌ రౌండ్‌లో పాల్గొననున్నారు. ఈ పోటీలు ఉదయం 8 గంటలకు జరగనున్నాయి. ఇక భారత హాకీ మహిళా జట్టు కూడా రేపు ఆస్ట్రేలియా జట్టుతో పోటీ పడనుంది. క్వార్టర్ ఫైనల్ పోటీ అయిన ఈ మ్యాచ్ ఉదయం 8:30 గంటలకు ప్రారంభం కానుంది. ఆఖరుగా.. డిస్కస్ త్రో ఫైనల్ పోటీల్లో కమల్ ప్రీత్ కౌర్ పోటీ పడనుంది. ఈ పోటీలు సాయంత్రం 4:30 గంటలకు జరుగుతాయి.

Updated Date - 2021-08-02T07:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising