ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిథాలీ మరో ఘనత.. 9వ సారి టాప్ ప్లేస్‌లోకి..

ABN, First Publish Date - 2021-07-21T07:04:43+05:30

టీమిండియా సీనియర్ క్రికెటర్, వన్డే జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ మరో అరుదైన ఘనతను సాధించింది. 16ఏళ్ల తన క్రికెట్ కెరీర్లో ఏకంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా సీనియర్ క్రికెటర్, వన్డే జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ మరో అరుదైన ఘనతను సాధించింది. 16ఏళ్ల తన క్రికెట్ కెరీర్లో ఏకంగా 9వ సారి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్‌ టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది.


గతవారం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విండీస్‌ కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంది. మిథాలీ రెండో ప్లేస్‌లో నిలిచింది. అయితే పాక్‌తో జరిగిన 5 వన్డేల సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో 49, 21 పరుగులు మాత్రమే చేసిన స్టెఫానీ.. తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 30 పాయింట్లు కోల్పోవడంతో ఏకంగా 4 స్థానాలు దిగజారి ఐదో స్థానానికి పడిపోయింది. దీంతో మిథాలీ తిరిగి టాప్ ప్లేస్‌కు చేరింది. టీమిండియా ఉమెన్స్ జట్టులో ఇన్ని సార్లు అగ్రస్థానాన్ని చేరిన ఘనత కూడా మిథాలీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.



Updated Date - 2021-07-21T07:04:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising