ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోక్యోలో దుమ్మురేపుతున్న భారత అథ్లెట్లు.. 10కి చేరిన పతకాల సంఖ్య

ABN, First Publish Date - 2021-08-31T23:50:43+05:30

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పతకాలు కొల్లగొడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పతకాలు కొల్లగొడుతున్నారు. రియో ఒలిపింక్స్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు పురుషుల హై జంప్‌లో దేశానికి రజత పతకం అందించాడు. ఈ రోజు జరిగిన టీ63 ఈవెంట్‌లో మరియప్పన్ రజత పతకం సాధించగా, ఇదే ఈవెంట్‌లో శరద్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. దీంతో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 10కి చేరుకుంది. కాగా,  అమెరికాకు చెందిన శామ్ గ్రెవె స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.


భారత పారాలింపిక్స్ చరిత్రలో ఇన్ని పతకాలు సాధించడం ఇదే తొలిసారి. రియో పారాలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న వరుణ్ భాటి ఈసారి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 1.86 మీటర్ల మార్కును చేరుకున్న తర్వాత బంగారు పతకం కోసం తంగవేలు, శామ్ గ్రెవె మధ్య తీవ్ర పోటీ నెలకొంది.1.88 మీటర్ల మార్కును చేరుకునేందుకు మరియప్పన్ మూడుసార్లు విఫలం కాగా, శామ్ మూడోసారి విజయం సాధించాడు.రియోలో తంగవేలు 1.89 మీటర్లు జంప్ చేసి బంగారు పతకం గెలుచుకోగా, అప్పుడు శామ్ రజతం గెలుచుకున్నాడు. ఇప్పుడు ఈ పతకాలు తారుమారు అయ్యాయి.   



Updated Date - 2021-08-31T23:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising