ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లిఫ్టర్‌ మీరాబాయ్‌ ప్రపంచ రికార్డు

ABN, First Publish Date - 2021-04-18T05:53:52+05:30

ప్రపంచ మాజీ చాంపియన్‌ మీరాబాయ్‌ చాను ఆసియా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో వరల్డ్‌ రికార్డు సృష్టించింది. ఈ 26 ఏళ్ల భారత స్టార్‌ లిఫ్టర్‌ శనివారం జరిగిన 49 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత

తాష్కెంట్‌: ప్రపంచ మాజీ చాంపియన్‌ మీరాబాయ్‌ చాను ఆసియా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో వరల్డ్‌ రికార్డు సృష్టించింది. ఈ 26 ఏళ్ల భారత స్టార్‌ లిఫ్టర్‌ శనివారం జరిగిన 49 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించడంతో పాటు క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. తొలుత స్నాచ్‌లో 86 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 119 కిలోలు ఎత్తిన చాను..  మొత్తంగా 205 కిలోలతో మూడోస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 118 కిలోలతో ఉన్న ప్రపంచ రికార్డును చాను బద్దలుకొట్టింది. కాగా..ఈ విభాగంలో చాను గత అత్యుత్తమ ప్రదర్శన 115 కిలోలు. చైనాకు చెందిన హౌ ఝిహిహుయి, జియాంగ్‌ హుయిహు వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. ఇక, తాజా ఆసియా చాంపియన్‌షి్‌పతో కలిపి ఇప్పటివరకు ఆరు ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్లలో పాల్గొని మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో చానుకు టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ కూడా ఖాయమైంది.

Updated Date - 2021-04-18T05:53:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising