ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డే/నైట్ టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన లబుషేన్

ABN, First Publish Date - 2021-12-17T22:39:06+05:30

ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడిలైడ్: ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆరో సెంచరీ నమోదు చేసిన లబుషేన్.. డే/నైట్ టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. తొలి రోజు 21 పరుగుల వద్ద ఒకసారి, 95 పరుగుల వద్ద రెండోసారి లైఫ్ అందుకున్న లబుషేన్ సెంచరీ (103) చేసి రాబిన్సన్ బౌలింగ్‌లో దొరికిపోయాడు.


27 ఏళ్ల లబుషేన్ నిన్న 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టెస్టుల్లో 2 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఫలితంగా అత్యంత వేగంగా 2 వేల పరుగుల మార్కును చేరుకున్న మూడో ఆసీస్ ఆటగాడిగా, ఓవరాల్‌గా ఐదో వేగవంతమైన క్రికెటర్‌గా మరో రికార్డును కూడా తన పేరుపై రాసుకున్నాడు.


144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో, 3,068 మంది టెస్టు క్రికెటర్లలో డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా), జార్జ్ హెడ్‌లీ (వెస్టిండీస్), హెర్బర్ట్ సట్‌క్లిఫ్ (ఇంగ్లండ్), మైఖేల్ హస్సీ (ఆస్ట్రేలియా) మాత్రమే లుబషేన్ కంటే వేగంగా 2 వేల పరుగులు సాధించారు. బ్రాడ్‌మన్ 22, హెడ్లీ 32, హస్సీ 33 ఇన్నింగ్స్‌లలో 2 వేల పరుగులు సాధించగా లబుషేన్ 34 ఇన్నింగ్స్‌లలో ఆ రికార్డును చేరుకున్నాడు. 

Updated Date - 2021-12-17T22:39:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising