ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

80 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన జెమీసన్

ABN, First Publish Date - 2021-06-21T02:09:03+05:30

భారత్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమీసన్ అత్యంత అరుదైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌతాంప్టన్: భారత్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమీసన్ అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ఐదు కీలక వికెట్లు పడగొట్టిన జెమీసన్ భారత ఇన్సింగ్స్‌ను కూల్చడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ వికెట్లతో కలిపి జెమీసన్ 8 టెస్టుల్లో 44 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఇన్ని వికెట్లు తీసుకున్న తొలి న్యూజిలాండ్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో 80 ఏళ్ల నాటి రికార్డును బద్దలుగొట్టాడు. 1930, 1940లలో కివీస్‌కు ప్రాతినిధ్యం వహించిన జాక్ కౌవీ 8 టెస్టుల్లో 41 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడా రికార్డును జెమీసన్ తిరగరాశాడు. 


8 టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో జెమీసన్, జాక్ కౌల్ తర్వాత షేన్ బాండ్ ఉన్నాడు. 2001-2003 మధ్య అతడు 38 వికెట్లు పడగొట్టాడు. 2011-2012లో డగ్ బ్రాస్‌వెల్ 33 వికెట్లు తీసుకోగా, 1969లో హెడ్లీ హోవర్త్ 32 వికెట్లు తీసుకున్నాడు.

Updated Date - 2021-06-21T02:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising