ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కష్టాల్లో కోల్‌కతా.. రస్సెల్ హాఫ్ సెంచరీ

ABN, First Publish Date - 2021-04-22T04:04:45+05:30

భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఇబ్బందులు పడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు.. సీజన్‌లో తొలిసారి 200పైచిలుకు పరుగులు సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఇబ్బందులు పడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు.. సీజన్‌లో తొలిసారి 200పైచిలుకు పరుగులు సాధించింది. ఈ భారీ స్కోరు ఛేదనలో కోల్‌కతా జట్టుకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(0), నితీష్ రాణా(9) శుభారంభం అందించలేకపోయారు. వీరి తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి(8), ఇయాన్ మోర్గాన్(7)తోపాటు ఎన్నో అంచనాలతో జట్టులోకి వచ్చిన సునీల్ నరైన్(4) కూడా నిరాశ పరిచాడు.


దీంతో కోల్‌కతా జట్టు 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. చెన్నై యువ బౌలర్ దీపక్ చాహర్.. 4 వికెట్లతో కోల్‌కతా పతనాన్ని శాసించాడు. ప్రస్తుతం దినేష్ కార్తిక్(23), ఆండ్రీ రస్సెల్(54) క్రీజులో ఉన్నారు. సీజన్ ప్రారంభమైన తర్వాత తొలిసారి ఈ మ్యాచులో రస్సెల్ బ్యాటు ఝుళిపిస్తున్నాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతను కోల్‌కతా జట్టు గెలుపు అవకాశాలు వీరిద్దరి భాస్వామ్యంపైనే ఆధారపడి ఉంది.

Updated Date - 2021-04-22T04:04:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising