ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాచ్ మధ్యలో కోహ్లీ వెళ్లిపోడానికి కారణం ఏంటంటే..

ABN, First Publish Date - 2021-03-19T22:59:28+05:30

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించిన విషయం తెలిసిందే. 185 పరుగుల స్కోరును కాపాడుకుంటూ చివరివరకు పోరాడి గెలపు సొంతం చేసుకుంది. కాగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ మధ్యలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించిన విషయం తెలిసిందే. 185 పరుగుల స్కోరును కాపాడుకుంటూ చివరివరకు పోరాడి గెలుపు సొంతం చేసుకుంది. కాగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ మధ్యలో వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అత్యంత ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీ వెళ్లిపోవడంపై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే మ్యాచ్ అనంతరం దీనిపై కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కాలు బెణికిందని, అలాగే ఫీల్డింగ్ చేస్తే కచ్చితంగా గాయం పెద్దదవుతుందన్న కారణంతోనే మైదానం వీడివెళ్లానని కోహ్లీ వివరించాడు. అందువల్లే కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్‌కు అప్పగించి డగౌట్‌లో కూర్చున్నట్లు కోహ్లీ వివరించాడు. ‘బంతికోసం వేగంగా పరిగెత్తి దానిని అందుకున్న తరువాత విసిరే క్రమంలో కాలు బెణికింది. అలాగే ఫీల్డింగ్ చేస్తే కచ్చితంగా గాయం పెద్దదవుతుంది. ఆ భయంతోనే 17 ఓవర్లో రోహిత్‌కు కెప్టెన్సీ అప్పగించి మైదానం బయటకు వెళ్లి కూర్చున్నాన’ని కోహ్లీ వివరించాడు. అయితే చివరి మూడు ఓవర్లలో రోహిత్ తనదైన కెప్టెన్సీతో అలరించాడు. అటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో 8 పరుగుల తేడాతో టీమిండియా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

Updated Date - 2021-03-19T22:59:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising