ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుడు మాట్లాడలేదే?.. పిచ్ విమర్శకులకు కోహ్లీ చురకలు

ABN, First Publish Date - 2021-03-04T10:54:22+05:30

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీసులో మూడో మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో ఆటగాళ్ల కన్నా పిచ్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీసులో మూడో మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో ఆటగాళ్ల కన్నా పిచ్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. మొతేరాల పిచ్ మరీ ఘోరంగా ఉందంటూ కొందరు సీనియర్లు విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్ ఈ విషయంపై ప్రతిరోజూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే వచ్చారు. అయితే ఈ విమర్శకులందరికీ కింగ్ కోహ్లీ చెక్ పెట్టాడు. పేసర్లకు అనుకూలించే సీమింగ్ పిచ్‌లపై మ్యాచ్ మూడురోజుల్లో ముగిస్తే ఎవరూ మాట్లాడరని, స్పిన్ పిచ్‌లపైనే విమర్శిస్తారని మండిపడ్డాడు. ‘‘సీమింగ్ ట్రాక్‌లపై జట్లు 40-45 పరుగులకే చాపచుట్టేసినా ఎవరూ పెదవి విప్పరు. మేమే న్యూజిలాండ్‌లో మూడు రోజుల్లోనే మ్యాచ్ ఓడిపోయాం. అప్పుడెవరూ పిచ్ గురించి మాట్లాడలేదే’’ అని కోహ్లీ చురకలు వేశాడు.

Updated Date - 2021-03-04T10:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising