టపటపా రాలుతున్న వికెట్లు.. నిరాశపరిచిన కోహ్లీ
ABN, First Publish Date - 2021-08-15T23:03:22+05:30
రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు త్వరత్వరగా వికెట్లు కోల్పోతోంది. నేడు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా
లండన్: రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు త్వరత్వరగా వికెట్లు కోల్పోతోంది. నేడు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 18 పరుగులకే కేఎల్ రాహుల్ (5) రూపంలో తొలి వికెట్ కోల్పోగా ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ రోహిత్ శర్మ (21) కూడా అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 27 పరుగులు మాత్రమే. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. పుజారాతో జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో నాలుగు ఫోర్లు కొట్టి జోరుమీద ఉన్నట్టు కనిపించాడు. అయితే, శామ్ కరన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొత్తంగా 31 బంతులు ఆడిన కోహ్లీ 20 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. పుజారా, రహానే క్రీజులో ఉన్నారు.
Updated Date - 2021-08-15T23:03:22+05:30 IST