ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేఎల్ రాహుల్‌కు జరిమానా

ABN, First Publish Date - 2021-09-06T00:02:23+05:30

టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు ఐసీసీ జరిమానా విధించింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు ఐసీసీ జరిమానా విధించింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ 46 పరుగులు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగులో కీపర్ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే, ఇది అవుట్ కాదంటూ థర్డ్ అంపైర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన బ్యాట్ ప్యాడ్స్‌కు తాకిందని భావించాడు. అయితే, రీప్లేలో మాత్రం బ్యాట్ ప్యాడ్లకు తాకలేదని, బంతికే తాకిందని తేలింది. అయితే, ఇదేమీ పట్టించుకోని రాహుల్ తన బ్యాట్ ప్యాడ్స్‌కు తాకిందని, కానీ రీప్లేలో మాత్రం వేరేలా వస్తోందని సైగల ద్వారా  ఆన్‌ఫీల్డ్ అంపైర్‌కు చెబుతూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.


రాహుల్ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాడంటూ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. దీంతోపాటు అతడి క్రమశిక్షణ రికార్డుకు ఓ డీమెరిట్ పాయింట్‌ను జతచేసింది. గత 24 నెలల్లో రాహుల్‌కు ఇదే తొలి తప్పు కావడం గమనార్హం. రాహుల్ తన తప్పును అంగీకరించడంతో విచారణ అవసరం లేదని ఐసీసీ పేర్కొంది. 

Updated Date - 2021-09-06T00:02:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising