ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KL Rahul: రికార్డుల మీద రికార్డులు

ABN, First Publish Date - 2021-08-13T20:59:53+05:30

లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ చేసిన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ చేసిన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఆసియాకు అవతల అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో భారత ఓపెనర్‌గా రికార్డులెక్కాడు. ఈ క్రమంలో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. ఆసియాకు ఆవల రాహుల్ 28 ఇన్నింగ్స్‌లలో 4 టెస్టులు సెంచరీలు చేశాడు. విదేశాల్లో మొత్తంగా 24 మ్యాచుల్లో 5 సెంచరీలు నమోదు చేశాడు.  


వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనర్‌గా ఆసియా ఆవల 69 ఇన్నింగ్స్‌లలో 4 టెస్టు సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో భారత బ్యాటింగ్ గ్రేట్ సునీల్ గవాస్కర్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. గవాస్కర్ 81 ఇన్నింగ్స్‌లలో 15 సెంచరీలు చేశాడు. రాహుల్ మరో ఘనత కూడా సాధించాడు. ఆసియాకు అవతల ప్రత్యర్థి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మ్యాచ్‌లో తొలి రోజే సెంచరీ చేసిన రెండో ఇండియన్ ఓపెనర్‌గానూ రాహుల్ రికార్డులకెక్కాడు. రాహుల్ కంటే ముందు నవజోత్ సింగ్ సిద్ధూ ఈ ఘనత సాధించాడు. 1989లో వెస్టిండీస్‌తో కింగ్‌స్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో సిద్ధూ ఓపెనర్‌గా తొలి రోజే 116 పరుగులు చేశాడు. 

Updated Date - 2021-08-13T20:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising