ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన కివీస్ ఓపెనర్!

ABN, First Publish Date - 2021-02-27T10:05:57+05:30

టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఓ రికార్డును కివీస్ సీనియర్ బ్యాట్స్‌మెన్, ఓపెనర్ మార్టిల్ గప్తిల్ బద్దలు కొట్టాడు. అది ఏ రికార్డో తెలుసా? టీ20ల్లో అత్యధిక సిక్సుల రికార్డు. న్యూజిల్యాండ్ - ఆస్ట్రేలియా మధ్య గురువారం జరిగిన టీ20 మ్యాచ్‌లో గప్తిల్ ఈ ఘనత సాధించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆక్లాండ్: టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఓ రికార్డును కివీస్ సీనియర్ బ్యాట్స్‌మెన్, ఓపెనర్ మార్టిల్ గప్తిల్ బద్దలు కొట్టాడు. అది ఏ రికార్డో తెలుసా? టీ20ల్లో అత్యధిక సిక్సుల రికార్డు. న్యూజిల్యాండ్ - ఆస్ట్రేలియా మధ్య గురువారం జరిగిన టీ20 మ్యాచ్‌లో గప్తిల్ ఈ ఘనత సాధించాడు. ఈ రెండు జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో భాగంగా జరిగిన రెండో టీ20  మ్యాచ్‌లో కివీస్ ఓపెనర్ గప్తిల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 50 బంతుల్లోనే 8 సిక్స్‌లు, 6 ఫోర్లతో 97 ప‌రుగులు చేశాడు. ఈ క్రమంలో ఈ సీనియర్ బ్యాట్స్‌మెన్ టీ20ల్లో కొట్టిన సిక్సర్ల సంఖ్య 132కు చేరింది. ఈ మ్యాచ్ ముందు వరకూ గప్తిల్ 95 మ్యాచుల్లో 124 సిక్సర్లు కొట్టాడు.


టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 108 మ్యాచుల్లో 127 సిక్సర్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు గప్తిల్ అతన్ని బీట్ చేశాడు. వీళ్ల తర్వాత వరుసగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయార్ మోర్గాన్ (97 మ్యాచుల్లో 113 సిక్స్‌లు), న్యూజిలాండ్‌కు చెందిన కొలిన్ మ‌న్రో (107), విండీస్ సునామీ క్రిస్‌గేల్(105) ఉన్నారు. అయితే గేల్ ఈ సిక్సులన్నీ కేవ‌లం 58 మ్యాచుల్లోనే బాదడం గమనార్హం.

Updated Date - 2021-02-27T10:05:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising