ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanpur Test: అక్సర్ పటేల్ దెబ్బకు కుప్పకూలిన కివీస్

ABN, First Publish Date - 2021-11-27T21:15:29+05:30

భారత బౌలర్ అక్సర్ పటేల్ దెబ్బకు న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఈ లెఫ్టార్మ్ బౌలర్ దాటికి కివీస్ బ్యాటర్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూరు: భారత బౌలర్ అక్సర్ పటేల్ దెబ్బకు న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఈ లెఫ్టార్మ్ బౌలర్ దాటికి కివీస్ బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. రెండు వికెట్ల నష్టానికి 197 పరుగులతో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్ ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 


ఓవర్‌నైట్ స్కోరు 129/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 151 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రికార్డు భాగస్వామ్యంతో భారత్‌కు కొరకరాని కొయ్యగా మారిన ఓపెనర్లను అశ్విన్ విడదీశాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న యంగ్‌.. అశ్విన్ బౌలింగులో సబ్‌స్టిట్యూట్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 214 బంతులు ఎదుర్కొన్న యంగ్ 15 ఫోర్లతో 89 పరుగులు చేశాడు. దీంతో 151 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.  ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. 


అనంతరం అక్సర్ పటేల్  మాయాజాలం కొనసాగింది. రాస్‌టేలర్ (11), హెన్రీ నికోలస్ (2)లను వెంటవెంటనే వెనక్కి పంపాడు. మరోవైపు, క్రీజులో పాతుకుపోయి సెంచరీకి చేరువైన ఓపెనర్ టామ్ లాథమ్ (95)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత టామ్ బ్లండెల్ (13), టిమ్ సౌథీ (5) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్న అక్సర్ మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టి కివిస్‌ను దారుణంగా దెబ్బతీశాడు. ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజాకు చెరో వికెట్ లభించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి భారత్ కంటే 61 పరుగులు వెనకబడి ఉంది.

Updated Date - 2021-11-27T21:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising