ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కష్టాల్లో కివీస్.. వెంటనే వెంటనే రెండు వికెట్లు డౌన్

ABN, First Publish Date - 2021-06-22T23:39:02+05:30

భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. పిచ్‌పై ఉన్న తేమను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పరుగు తేడాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌతాంప్టన్: భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. పిచ్‌పై ఉన్న తేమను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్క పరుగు తేడాతో రెండు వికెట్లు పడగొట్టడంతో కివీస్ ఒత్తిడిలోకి జారుకుంది. 101/2తో ఐదో రోజు తొలి ఇన్సింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 117 వద్ద మూడో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగులో రాస్ టేలర్ (11) అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రీ నికోలస్‌ (7)ను ఇషాంత్ పెవిలియన్‌కు పంపి కివీస్‌ను మరో దెబ్బ కొట్టాడు.


అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 134 పరుగులు. దానికి ఒక్క పరుగు జోడించిన తర్వాత కివీస్ మరో వికెట్ కోల్పోయింది. షమీ వేసిన బంతిని వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ (1) వికెట్లను గిరాటేసింది. దీంతో 135 పరుగులకే కివీస్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ కోల్పోయిన ఐదు వికెట్లలో ఇషాంత్, షమీ చెరో రెండు వికెట్లు తీసుకోగా, అశ్విన్‌కు ఓ వికెట్ దక్కింది.

Updated Date - 2021-06-22T23:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising