ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ను ఇలా చూస్తుంటే హృదయం ముక్కలవుతోంది: పీటర్సన్

ABN, First Publish Date - 2021-05-11T21:41:35+05:30

భారత్‌లోని పరిస్థితిని తలుచుకుంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తానెంతగానో ప్రేమించే భారత్‌ను ఇలా చూస్తుంటే తన హృదయం బద్దలవుతోందని, ఈ పరిస్థితి నుంచి భారత్ త్వరగానే బయటపడుతుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-14లోని మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా వ్యహరించిన పీటర్సన్.. టోర్నీ వాయిదా పడడంతో తాజాగా స్వదేశానికి చేరుకున్నాడు. 


భారత్‌లోని పరిస్థితిని తలుచుకుంటూ హిందీలో ట్వీట్ చేశాడు. `నేను భారత్‌ను వదిలిపెట్టి వచ్చాను. కానీ, నా మనసంతా అక్కడే ఉంది. నాపై ఎంతో ప్రేమను కురిపించిన, ఆప్యాయత పంచిన దేశం గురించి నేను ఆలోచిస్తూనే ఉంటాను` అంటూ పీటర్సన్ ట్వీట్ చేశాడు. కోవిడ్‌ సంక్షోభం నుంచి బయటపడగల సత్తా భారత్‌కు ఉందని, కరుణ, ప్రే​మ కురిపించే దేశాన్ని మహమ్మారి ఏమీ చేయలేదని పేర్కొన్నాడు. 



Updated Date - 2021-05-11T21:41:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising