ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22న విష్ణుతో జ్వాల పెళ్లి

ABN, First Publish Date - 2021-04-14T08:49:47+05:30

భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ గుత్తా జ్వాల (37) ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. కొంతకాలంగా తమిళ హీరో విష్ణు విశాల్‌ (36)తో డేటింగ్‌ చేస్తున్న జ్వాల మంగళవారం తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పెళ్లి శుభలేఖను పోస్టు చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై (ఆంధ్రజ్యోతి): భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ గుత్తా జ్వాల (37) ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. కొంతకాలంగా తమిళ హీరో విష్ణు విశాల్‌ (36)తో డేటింగ్‌ చేస్తున్న జ్వాల మంగళవారం తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పెళ్లి శుభలేఖను పోస్టు చేసింది. ఈ జోడీకి గత సెప్టెంబరులోనే ఎంగేజ్‌మెంట్‌ అయిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో ఈనెల 22న వీరి వివాహం జరగనుంది. ఇక, 2005లో షట్లర్‌ చేతన్‌ ఆనంద్‌ను వివాహం చేసుకున్న జ్వాల 2011లో విడిపోయింది. అలాగే విశాల్‌ 2010లో తన స్నేహితురాలు.. కోలీవుడ్‌కు చెందిన కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రజనీ నటరాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే 2018లో వీరు విడిపోయారు. వీరికి ఆర్యన్‌ అనే మూడేళ్ల కుమారుడున్నాడు. విష్ణు విశాల్‌ ఇటీవలే విడుదలైన తెలుగు సినిమా ‘అరణ్య’లో నటించాడు.

Updated Date - 2021-04-14T08:49:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising