ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అదే: నీరజ్ చోప్రా

ABN, First Publish Date - 2021-08-10T20:38:55+05:30

జాతీయ శిక్షణ శిబిరంలో చేరడమే తన క్రీడాజీవితాన్ని మలుపు తిప్పిందని జావెలిన్ త్రో క్రీడాకారుడు, పసిడి పతక విజేత నీరజ్ చోప్రా తాజాగా పేర్కొన్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జాతీయ శిక్షణ క్యాంప్‌లో చేరడమే తన క్రీడాజీవితాన్ని మలుపు తిప్పిందని జావెలిన్ త్రో క్రీడాకారుడు, పసిడి పతక విజేత నీరజ్ చోప్రా తాజాగా పేర్కొన్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో పసిడి పతకాన్ని గెలిచి నీరజ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో 100 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. కాగా.. నీరజ్ మంగళవారం తన క్రీడాజీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.


‘‘2015/16 నేషనల్ గేమ్స్ తరువాత జాతీయ శిక్షణా క్యాంప్‌లో చేరడమే నా క్రీడాజీవితాన్ని మలుపు తిప్పింది. అంతకుమనుపు..నా వంట నేనే వండుకునే వాడిని.. మంచి శిక్షణ తీసుకునే వాడిని. అయితే..ట్రెయినింగ్ క్యాంప్‌లో చేరాకే శిక్షణ వసతులు మెరుగయ్యాయి. సీనియర్ క్రీడాకారులను చూసి స్ఫూర్తి పొందేవాడిని. జాతీయస్థాయి ఉత్తమ క్రీడాకారులతో కలిసి ట్రెయినింగ్ తీసుకోవడం ఓ గొప్ప అనుభూతి. శిక్షణ సందర్భంగా చాలా కష్టపడ్డా..ఆ తాలుకు ఫలితం ఇప్పుడు మన కళ్లముందు ఉంది.’’ అని నీరజ్ తెలిపారు. నీరజ్ గెలుపును పురస్కరించుకుని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీరజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

Updated Date - 2021-08-10T20:38:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising