ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వర్ణం తెచ్చిన తరువాత నీరజ్ కామెంట్స్ ఇవే..

ABN, First Publish Date - 2021-08-08T02:16:16+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా ఈ అద్భుత విజయంపై తొలిసారిగా స్పందించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా ఈ అద్భుత విజయంపై తొలిసారిగా స్పందించాడు. ‘‘ఇది నేను నమ్మలేకపోతున్నాను’’ అంటూ కామెంట్ చేశాడు. ‘‘అథ్లెటిక్స్‌లో భారత్‌కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి. ఇవి నాకు, దేశానికి గర్వించదగ్గ క్షణాలు’’ అని కామెంట్ చేశాడు. స్వర్ణం వస్తుందని ముందే ఊహించారా..? అని అడగ్గా..ఇంతటి విజయం లభిస్తుందని ఊహించలేదని చెప్పుకొచ్చాడు. ‘‘క్వాలిఫికేషన్ రౌండ్‌లో మంచి ప్రదర్శన చేశా. ఫైనల్స్‌లోనూ బాగానే ఆడతానని అనుకున్నా. కానీ స్వర్ణం వస్తుందని ఊహించలేదు. చాలా చాలా సంతోషంగా ఉంది.’’ అని నీరజ్ పేర్కొన్నాడు. ‘‘నా పతకాన్ని మిల్కా సింగ్‌కు అంకితమిస్తున్నా. మిల్కా సింగ్, పీటీ ఉషతోపాటు.. ఒలింపిక్స్ పతకానికి కొద్ది దూరంలో నిలిచిపోయిన భారత క్రీడాకారులకు నా పతకం అంకితం’’ అని పేర్కొన్నాడు. నేడు జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో నీరజ్.. ఈటెను అత్యధికంగా 87.58మీటర్ల దూరానికి విసిరి స్వర్ణాన్ని సాధించిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-08-08T02:16:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising