ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sri Lanka: క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన ఆల్‌రౌండర్ ఉడానా

ABN, First Publish Date - 2021-07-31T23:11:51+05:30

శ్రీలంక లెఫ్టార్మ్ సీమర్ ఇసురు ఉడానా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తక్షణం తప్పుకుంటున్నట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: శ్రీలంక లెఫ్టార్మ్ సీమర్ ఇసురు ఉడానా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తక్షణం తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇండియాతో ఇటీవల ముగిసిన మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో ఆడిన 33 ఏళ్ల ఉడానా తన నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. 


టీ20 ప్రపంచకప్‌లో భాగంగా 2009లో నాటింగ్‌హామ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో ఉడానా టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో 47 పరుగులు చేసి, రెండు వికెట్లు నేలకూల్చాడు. 2012లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. లోయర్ ఆర్డర్‌లో ఉపయుక్తమైన ఆటగాడిగా పేరుకెక్కాడు.


మొత్తంగా 21 వన్డేల్లో 52.77 సగటుతో 18 వికెట్లు తీసుకోగా, 35 టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. ఉడానా ఆడిన చివరి మ్యాచ్‌లో ఒక ఓవర్ వేసి 7 పరుగులు ఇచ్చాడు. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో ఉడానా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. పది మ్యాచుల్లో 35.25తో 8 వికెట్లు తీసుకున్నాడు.

Updated Date - 2021-07-31T23:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising