ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐర్లాండ్ రికార్డ్.. క్రికెట్ చరిత్రలో తొలిసారి

ABN, First Publish Date - 2021-07-14T05:56:30+05:30

ఐర్లాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. క్రికెట్ చరిత్రలో తొలిసారి సౌత్‌ఆఫ్రికా జట్టును ఓడించింది. మంగళవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో ఐర్లాండ్ ఈ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డర్బన్: ఐర్లాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. క్రికెట్ చరిత్రలో తొలిసారి సౌత్‌ఆఫ్రికా జట్టును ఓడించింది. మంగళవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో ఐర్లాండ్ ఈ ఘనత సాధించింది. సౌత్‌ఆఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఇర్లాండ్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌కు మంచి ఆరంభం దక్కింది. పాల్ స్టిర్లింగ్(27)తో పర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్, జట్టు కెప్టెన్ ఆండ్రూ బల్‌బర్నీ(102) సెంచరీతో కదం తొక్కాడు. అతడికి తోడు హారీ టెక్టర్(79) అర్థ సెంచరీతో అదరగొట్టగా.. జార్జ్ డాక్‌(45) రాణించాడు. దీంతో ఐర్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 290 పరుగుల భారీ స్కోరు చేసింది. సౌత్‌ఆఫ్రికా బౌలర్లలో అండైల్ పెహ్లుక్వాయో 2 వికెట్లు దక్కించుకోగా కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, తబ్రయిజ్ షంషి తలా ఓ వికెట్ తీసుకున్నారు.


అనంతరం 291 పరుగులతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను ఐర్లాండ్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ఐర్లాండ్‌కు బౌలింగ్‌లో మార్క్, అడైర్, జాషువా లిటిల్, యాండీ మెక్‌బ్రెయిన్‌లు తలా రెండు వికెట్లు తీయగా, క్రెయిగ్ యంగ్, సిమి సింగ్, జార్జ్ డాక్‌‌రెల్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. దీంతో దక్షిణాఫ్రికా 247 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ జానేమన్ మలన్(84) ఒక్కడే అర్థ సెంచరీ చేశాడు. ఆ తర్వాత రసి వ్యాన్‌డెర్‌సన్(49) మాత్రమే పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లంతా కనీసం పోరాడకుండా పెవిలియన్ చేరడంతో 48.3 ఓవర్లలో 247 పరుగులకే సౌత్‌ఆఫ్రికా ఆలవుట్ అయింది. 43 పరుగల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధిచింది. దీంతో క్రికెట్ చరిత్రలో తొలిసారి ఐర్లాండ్ చేతిలో సౌత్‌ఆఫ్రికా ఓడినట్లైంది. ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బర్‌బర్నీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Updated Date - 2021-07-14T05:56:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising