ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రైజింగ్‌’ అవ్వాలని..

ABN, First Publish Date - 2021-04-05T10:12:40+05:30

హైదరాబాద్‌ ఉండి తీరుతుంది. ప్లేఆఫ్స్‌కు సునాయాసంగానే చేరుకుంటున్నా.. ఆ తర్వాతే అడుగు ముందుకు పడడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్‌  4 రోజుల్లో

గత ఐదేళ్లుగా అత్యంత నిలకడగా రాణిస్తున్న జట్లలో సన్‌రైజర్స్‌ 


హైదరాబాద్‌ ఉండి తీరుతుంది. ప్లేఆఫ్స్‌కు సునాయాసంగానే చేరుకుంటున్నా.. ఆ తర్వాతే అడుగు ముందుకు పడడం లేదు. వార్నర్‌, బెయిర్‌స్టో, విలియమ్సన్‌, మనీశ్‌ పాండే, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌, నటరాజన్‌ ఇలా సూపర్‌ లైన్‌పతో పటిష్ఠంగా కనిపించే రైజర్స్‌ ఖాతాలో టైటిల్‌ మాత్రం ఒక్కటే ఉంది. తమ మిడిలార్డర్‌ బలహీనతను అధిగమిస్తూ ఈసారి కచ్చితంగా రైజింగ్‌ కావాలనుకుంటోంది.


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం): ఐపీఎల్‌లో ఆలస్యంగా ప్రవేశించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటలో మాత్రం తక్కువేం కాదు. నిలకడకు మారుపేరుగా ఈ జట్టు నిలుస్తుంటుంది. లీగ్‌లో ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న ఆరెంజ్‌ ఆర్మీ ఏకంగా ఆరుసార్లు ప్లేఆ్‌ఫ్సలో ప్రవేశించింది. 2016లో డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలో జట్టు విజేతగానూ నిలిచింది. ఆ తర్వాత అన్ని సీజన్లలో టాప్‌-4లో ఉంటూ ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతోంది. కానీ మరో టైటిల్‌ మాత్రం ఇంకా ఊరిస్తూనే ఉంది. గత సీజన్‌లో నెమ్మదిగా పుంజుకుని టాప్‌-3 టీమ్స్‌ను ఓడిస్తూ ప్లేఆ్‌ఫ్సలో అడుగుపెట్టినా.. క్వాలిఫయర్‌-2లో ఢిల్లీ చేతిలో ఓడింది. ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో సన్‌రైజర్స్‌ నుంచి ఎలాంటి హడావిడి కనిపించలేదు. తమ కోర్‌ గ్రూప్‌ ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటూ ముగ్గురిని బ్యాక్‌పగా తీసుకుంది. అయితే మిచెల్‌ మార్ష్‌ టోర్నీ ఆరంభానికి ముందే వైదొలగగా.. అతడి స్థానంలో జేసన్‌ రాయ్‌ జట్టులోకి వచ్చాడు.


బలం

విధ్వంసకరమైన టాపార్డర్‌తో పాటు అద్భుత బౌలింగ్‌ దళం జట్టు ప్రధాన బలం. ఓపెనర్‌ వార్నర్‌ ప్రతీ సీజన్‌లోనూ భారీగా పరుగులు సాధిస్తుంటాడు. బెయిర్‌స్టోతో అతడి ఇన్నింగ్స్‌ ప్రత్యర్ధులను బెదరగొడుతుంటుంది. తొలిబంతి నుంచే వీరి విధ్వంసం మొదలైతే ఎంతటి స్కోరైనా దిగదుడుపే అవుతుంది. అయితే గతేడాది చివరి మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా సాహా కూడా ఆకట్టుకున్నాడు. అవసరమైతే రాయ్‌ రూపంలో మరో సూపర్‌ ఆప్షన్‌ ఉంది. విలియమ్సన్‌, పాండే కీలక సమయాల్లో జట్టును ఆదుకోవడంలో సిద్ధహస్తులు. బౌలింగ్‌ విభాగంలో నైతే పేసర్ల ఫ్యాక్టరీయే ఉంది. భువనేశ్వర్‌, నటరాజన్‌, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌, థంపీ.. ఇలా అంతా దాడికి సిద్ధంగా ఉన్నారు. స్పిన్‌లో రషీద్‌ ఖాన్‌కు జతగా ఈసారి ముజీబుర్‌ జట్టులోకి వచ్చాడు.


బలహీనత

చాలాకాలం నుంచి జట్టును వేధిస్తున్న సమస్య మిడిలార్డర్‌.. చక్కటి ఫినిషర్‌. ప్రతీసారి టాప్‌-3 ఆటగాళ్లపై ఆధారపడి విజయాలు సాధించడం కష్టం. కచ్చితంగా వారి ఆరంభాన్ని భారీ స్కోర్లుగా మార్చాలంటే మిడిల్‌లో తోడ్పాటు అవసరం. క్రితంసారి అభిషేక్‌ శర్మ, ప్రియమ్‌ గార్గ్‌, విరాట్‌ సింగ్‌, అబ్దుల్‌ సమద్‌లాంటి అనుభవం లేని ఆటగాళ్లపై ఆధారపడాల్సి వచ్చింది. అందుకే మొన్నటి వేలంలో కేదార్‌ జాదవ్‌లాంటి సీనియర్‌ను తీసుకుంది. అయితే అతడెప్పుడూ దూకుడుగా ఆడింది లేదు. విదేశీ ఆటగాళ్లలో హోల్డర్‌, నబీ ఫినిషర్లుగా కనిపిస్తున్నా వారికి అన్ని మ్యాచ్‌ల్లో చోటు దక్కడం కష్టం. విజయ్‌ శంకర్‌ ఎప్పుడో ఓసారి బ్యాట్‌ ఝుళిపిస్తుంటాడు. అలాగే బౌలింగ్‌లో రషీద్‌పై ఎక్కువగా ఆధారపడుతుంటుంది.


ఉత్తమ ప్రదర్శన

2016: విజేత

2018: రన్నరప్‌

2013, 2017, 

2019, 2020: ప్లేఆఫ్స్‌జట్లు


స్వదేశీ ఆటగాళ్లు: మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, భువనేశ్వర్‌, నటరాజన్‌, సాహా, ప్రియమ్‌ గార్గ్‌, విజయ్‌ శంకర్‌, శ్రీవత్స్‌ గోస్వామి, అభిషేక్‌ శర్మ, సుచిత్‌, సమద్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, బాసిల్‌ థంపి, షాబాజ్‌ నదీమ్‌, విరాట్‌ సింగ్‌.


విదేశీ ఆటగాళ్లు: వార్నర్‌ (కెప్టెన్‌), బెయిర్‌స్టో, విలియమ్సన్‌, రాయ్‌, హోల్డర్‌, నబీ, ముజీబుర్‌, రషీద్‌ ఖాన్‌.


సన్‌రైజర్స్‌ఎవరితో ఎప్పుడు ?

తేదీ    మ్యాచ్‌

ఏప్రిల్‌ 11 కోల్‌కతా

ఏప్రిల్‌ 14 బెంగళూరు

ఏప్రిల్‌ 17 ముంబై

ఏప్రిల్‌ 21 పంజాబ్‌

ఏప్రిల్‌ 25 ఢిల్లీ

ఏప్రిల్‌ 28 చెన్నై

మే 2 రాజస్థాన్‌ 

మే 4 ముంబై

మే 7 చెన్నై

మే 9 బెంగళూరు

మే 13 రాజస్థాన్‌

మే 17 ఢిల్లీ

మే 19 పంజాబ్‌

మే 21 కోల్‌కతా

Updated Date - 2021-04-05T10:12:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising