ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదిరింది ఆర్సీబీ బోణీ

ABN, First Publish Date - 2021-04-10T09:11:07+05:30

ఐపీఎల్‌-14వ సీజన్‌లో ప్రారంభ మ్యాచే అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను కలిగించింది. ‘క్లాష్‌ ఆఫ్‌ ది సూపర్‌ స్టార్స్‌’గా పేర్కొన్న బెంగళూరు-ముంబై జట్లు చిట్టచివరి బంతి వరకు హోరాహోరీగా తలపడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్‌లో ముంబైపై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా హర్షల్‌ 

ఆఖరి బంతికి గెలిచిన కోహ్లీ సేన

ముంబైకి నిరాశ

హర్షల్‌కు ఐదు వికెట్లు


ఐపీఎల్‌-14వ సీజన్‌లో ప్రారంభ మ్యాచే అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను కలిగించింది.  ‘క్లాష్‌ ఆఫ్‌ ది సూపర్‌ స్టార్స్‌’గా పేర్కొన్న బెంగళూరు-ముంబై జట్లు చిట్టచివరి బంతి వరకు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే ఒత్తిడిని తట్టుకుని నిలిచిన కోహ్లీ సేన శుభారంభం చేయగలిగింది. బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్‌ (5/27).. బ్యాటింగ్‌లో డివిల్లీర్స్‌ (48) ఆదుకున్నారు. మరోవైపు బ్యాటింగ్‌లో విఫలమైన ముంబై ఇండియన్స్‌ ఓటమితో లీగ్‌ను ఆరంభించే సంప్రదాయాన్ని తొమ్మిదోసారీ కొనసాగించింది. 


చెన్నై: ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లో ఎన్నడూ గెలుపు రుచి చూడని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఈసారి అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌షో కనబర్చిన ఈ జట్టు చివరి బంతికి గట్టెక్కింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన 2 వికెట్ల తేడాతో గెలిచింది. చెపాక్‌ స్టేడియంలో ఆర్సీబీ నెగ్గడం 2011 తర్వాత ఇదే తొలిసారి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌ (49), సూర్యకుమార్‌ (31), ఇషాన్‌ కిషన్‌ (28) రాణించారు. హర్షల్‌ పటేల్‌ కెరీర్‌లో తొలిసారి 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసి గెలిచింది. మ్యాక్స్‌వెల్‌ (39), కోహ్లీ (33) రాణించారు. బుమ్రా, జాన్సెన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హర్షల్‌ నిలిచాడు. 


ఆదుకున్న డివిల్లీర్స్‌:

ఓ మాదిరి లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన బెంగళూరు పవర్‌ప్లేలోనే ఓపెనర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (10), రజత్‌ పటీదార్‌ (8) వికెట్లను కోల్పోయింది. అయితే చివర్లో డివిల్లీర్స్‌ జట్టుకు అండగా నిలబడ్డాడు. అటు కోహ్లీ మాత్రం ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగుతూ ఫోర్లతో స్కోరును పెంచాడు. అతడికి మ్యాక్స్‌వెల్‌ అండగా నిలిచాడు. 8వ ఓవర్‌లో మ్యాక్స్‌ రెండు ఫోర్లు సాధించగా, 11వ ఓవర్‌లో బాదిన సిక్సర్‌ అయితే చెపాక్‌ ఆవల పడింది. ఇది అతడి 19 ఇన్నింగ్స్‌ తర్వాత వచ్చిన సిక్సర్‌ కావడం విశేషం. అయితే 13వ ఓవర్‌లో కోహ్లీని బుమ్రా ఎల్బీ చేయగా.. 15వ ఓవర్‌లో మ్యాక్స్‌ను జాన్సెన్‌ అవుట్‌ చేయడంతో ముంబై ఊపిరిపీల్చుకుంది.


ఇక పరుగులు నెమ్మదించిన దశలో చాహర్‌ ఓవర్‌లో డివిల్లీర్స్‌ వరుసగా 4,6 సాధించి 15 పరుగులు రాబట్టాడు. క్రిస్టియన్‌ (1) కూడా అవుట్‌ కావడంతో చివర్లో ఉత్కంఠ పెరిగింది. అయితే గెలుపు బాధ్యతను తీసుకున్న ఏబీ చెలరేగాడు. 18వ ఓవర్‌లో 6,4తో లక్ష్యాన్ని 12 బంతుల్లో 19 పరుగులకు తెచ్చాడు. మరుసటి ఓవర్‌లో రెండు ఫోర్లు బాదగా చివరి ఓవర్‌లో 7 రన్స్‌ అవసరమయ్యాయి. తొలి 3 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. కానీ నాలుగో బంతికి రెండో రన్‌ కోసం వెళ్లిన ఏబీ రనౌటయ్యాడు. దీంతో 2 బంతుల్లో 2 పరుగులు అవసరపడగా ఓ లెగ్‌బైతో పాటు హర్షల్‌ విన్నింగ్‌ రన్‌ తీయడంతో ఆర్‌సీబీ గట్టెక్కింది.


దెబ్బతీసిన హర్షల్‌:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ను ఆరంభ.. డెత్‌ ఓవర్లలో ఆర్‌సీబీ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ముఖ్యంగా పేసర్‌ హర్షల్‌ పటేల్‌ అంచనాలకు మించి రాణించాడు. అయితే క్రిస్‌ లిన్‌-సూర్యకుమార్‌ జోడీ మాత్రం దూకుడును కనబరిచింది. నాలుగో ఓవర్‌లోనే కోహ్లీ త్రోతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(19) రనౌట్‌ అయినా.. లిన్‌-సూర్య దుమ్మురేపారు. వీరి జోరుకు స్కోరు 200కు చేరుతుందనిపించింది. ఏడో ఓవర్‌లో వరుసగా 4,6తో లిన్‌ బ్యాట్‌ ఝుళిపించగా అటు సూర్య కూడా చెత్త బంతులను ఫోర్లుగా మలిచాడు. వీరి ధాటికి రెండో వికెట్‌కు 44 బంతుల్లోనే 70 పరుగులు వచ్చాయి. అయితే 11వ ఓవర్‌లో సూర్యను పేసర్‌ జేమిసన్‌ అవుట్‌ చేశాడు.


మరో ఓవర్‌ వ్యవధిలోనే ప్రమాదకర లిన్‌ను స్పిన్నర్‌ సుందర్‌ అద్భుత రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చడంతో తడబాటు ఆరంభమైంది. అటు ఇషాన్‌ కిషన్‌ (28) 14వ ఓవర్‌లో 6,4తో 15 పరుగులు రాబట్టాడు. కానీ, డెత్‌ ఓవర్లలో హర్షల్‌ గట్టి దెబ్బే తీశాడు. తన చివరి మూడు ఓవర్లలో ముంబైని వణికించాడు. ముందుగా హార్దిక్‌ పాండ్యా (13), ఇషాన్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత 20వ ఓవర్‌లో వరుసగా నాలుగు బంతుల్లో  క్రునాల్‌ పాండ్యా (7), కీరన్‌ పొలార్డ్‌ (7), మార్కో జాన్సెన్‌ (0)లను అవుట్‌ చేసి తొలిసారి ఐదు వికెట్లు సాధించాడు. చివరి బంతికి రాహుల్‌ చాహర్‌ (0) రనౌట్‌ కావడంతో ముంబై ఒక్క పరుగే చేసింది. అలాగే 2016 తర్వాత తమ చివరి 4 ఓవర్లలో 25 పరుగులే చేయడం ముంబైకిదే తొలిసారి.


స్కోరు బోర్డు

ముంబై: రోహిత్‌ శర్మ(రనౌట్‌) 19; క్రిస్‌ లిన్‌ (సి అండ్‌ బి) సుందర్‌ 49; సూర్యకుమార్‌ (సి) డివిల్లీర్స్‌ (బి) జేమిసన్‌ 31; ఇషాన్‌ కిషన్‌ (ఎల్బీ) హర్షల్‌ 28; హార్దిక్‌ (ఎల్బీ) హర్షల్‌ 13; పొలార్డ్‌ (సి) సుందర్‌ (బి) హర్షల్‌ 7; క్రునాల్‌ (సి) క్రిస్టియన్‌ (బి) హర్షల్‌ 7; మార్కో జాన్సెన్‌ (బి) హర్షల్‌ 0; రాహుల్‌ చాహర్‌ (రనౌట్‌) 0; బుమ్రా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 159/9. వికెట్ల పతనం: 1-24, 2-94, 3-105, 4-135, 5-145, 6-158, 7-158, 8-158, 9-159. బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-22-0; జేమిసన్‌ 4-0-27-1; చాహల్‌ 4-0-41-0; షాబాజ్‌ అహ్మద్‌ 1-0-14-0; హర్షల్‌ పటేల్‌ 4-0-27-5; క్రిస్టియన్‌ 2-0-21-0; వాషింగ్టన్‌ సుందర్‌ 1-0-7-1.


బెంగళూరు: వాషింగ్టన్‌ (సి) లిన్‌ (బి) క్రునాల్‌ 10; కోహ్లీ (ఎల్బీ) బుమ్రా 33; పటీదార్‌ (బి) బౌల్ట్‌ 8; మ్యాక్స్‌వెల్‌ (సి) లిన్‌ (బి) జాన్సెన్‌ 39; డివిల్లీర్స్‌ (రనౌట్‌) 48; షాబాజ్‌ (సి) క్రునాల్‌ (బి) జాన్సెన్‌ 1; క్రిస్టియన్‌ (సి) చాహర్‌ (బి) బుమ్రా 1; జేమిసన్‌ (రనౌట్‌) 4; హర్షల్‌ పటేల్‌ (నాటౌట్‌) 4;  సిరాజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు:12; మొత్తం: 20 ఓవర్లలో 160/8; వికెట్ల పతనం: 1-36, 2-46, 3-98, 4-103, 5-106, 6-122, 7-152, 8-158; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-36-1; బుమ్రా 4-0-26-2; జాన్సెన్‌ 4-0-28-2; క్రునాల్‌ 4-0-25-1; రాహుల్‌ చాహర్‌ 4-0-43-0.  

Updated Date - 2021-04-10T09:11:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising