ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసీస్ టూర్‌లో మన ప్లేయర్లు.. వారి గాయాలు!

ABN, First Publish Date - 2021-01-13T04:51:27+05:30

ఆసీస్ టూర్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన ఇస్తోంది. ఇటీవలే జరిగిన మూడో టెస్టులో అద్భుత పోరాట పటిమ చూపి సిరీస్‌ను సజీవంగా నిలుపుకుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతమైన ప్రదర్శన ఇస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: ఆసీస్ టూర్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన ఇస్తోంది. ఇటీవలే జరిగిన మూడో టెస్టులో అద్భుత పోరాట పటిమ చూపి సిరీస్‌ను సజీవంగా నిలుపుకుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతమైన ప్రదర్శన ఇస్తోంది. అయితే ఇంత కష్టపడుతున్న టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. గాయాల కారణంగా కీలకమైన ఆటగాళ్లంతా నాలుగో టెస్టుకు దూరమయ్యారు. పేస్ దళంలో ఎంతో ముఖ్యమైన మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, అలాగే ఓపెనర్‌గా రాణిస్తున్న కేఎల్ రాహుల్, బంతితో బ్యాటుతో అద్భతుమైన ప్రదర్శన చేస్తున్న జడేజా ఇప్పటికే సిరీస్ నుంచి తప్పుకున్నారు. మిగతా ఆటగాళ్లలో కూడా చాలా మంది గాయాలతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో ఇప్పటి వరకూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన ఆటగాళ్లు, వాళ్లకు అయిన గాయాల వివరాలను ఓసారి పరిశీలిస్తే.. పుజారా, విహారి, అశ్విన్, పంత్‌లు గాయాలైనా సరే నొప్పిని భరిస్తూ మూడో టెస్టు నాలుగో ఇన్నింగ్సులో ఆడారు. జట్టుకు డ్రా అందించారు. ఓపెనర్‌గా రాణించిన మరో ఆటగాడు మయాంక్ అగర్వాల్ కూడా చేతివేలి గాయంతో స్కానింగ్‌కు వెళ్లాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా అబ్దామినల్ స్ట్రెయిన్‌తో బాధపడుతున్నాడు.


ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో భారత ఆటగాళ్లకు అయిన గాయాల వివరాలు ఇలా ఉన్నాయి.


మహమ్మద్ షమీ - చేతిగాయం

ఉమేష్ యాదవ్ - పిక్క గాయం

కేఎల్ రాహుల్ - మణికట్టు గాయం

రవీంత్ర జడేజా - బొటనవేలు గామం

ఛటేశ్వర్ పుజారా - చేతి వేలు

హనుమ విహారి - హ్యామ్‌స్ట్రింగ్(తొడకండరాలు)

రవిచంద్రన్ అశ్విన్ అశ్విన్ - వీపు

రిషభ్ పంత్ - భుజం గాయం

మయాంక్ అగర్వాల్ - వేలు

జస్ప్రీత్ బుమ్రా - అబ్దామినల్ స్ట్రెయిన్(పొత్తికడుపు కండరాల్లో నొప్పి)

Updated Date - 2021-01-13T04:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising