ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Paralympics: టేబుల్ టెన్నిస్‌లో ఫైనల్‌కు చేరిన భవినా పటేల్

ABN, First Publish Date - 2021-08-28T15:20:38+05:30

టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినా పటేల్ చరిత్ర సృష్టించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో (జపాన్):టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినా పటేల్ చరిత్ర సృష్టించింది. జపాన్ దేశంలోని టోక్యో నగరంలో శనివారం జరిగిన టేబుల్ టెన్నిస్ ఈవెంట్ లో భవినా ఫైనల్ కు చేరుకుంది. టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో భారతదేశ ప్లేయర్ భవినా ​​పటేల్ 7-11, 11-7, 11-4, 9-11, 11-8తో చైనాకు చెందిన జాంగ్ మియావోను ఓడించింది. ఆదివారం జరిగనున్న టేబుల్ టెన్నిస్ బంగారు పతకం పోటీలో చైనాకు చెందిన యింగ్ జౌతో భవినా తలపడనుంది.


టోక్యోలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్లాస్ 4 ఈవెంట్‌లో ప్రపంచ 3 వ ర్యాంకర్ చైనాకు చెందిన జాంగ్ మియావోపై భవినా ఘన విజయం సాధించారు. పారాలింపిక్స్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించిన మొదటి భారతీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా భవినా పటేల్ చరిత్రలో నిలిచారు. ‘‘నేను ఆటలో వందశాతం ప్రతిభ కనబర్చాను, ఫైనల్ ఈవెంటులో నేను బంగారుపతకం తప్పక సాధిస్తాను’’ అని భవినా ఆత్మవిశ్వాసంతో చెప్పారు. సంపూర్ణంగా కృషి చేస్తే సాధించలేనిది లేదని నిరూపించాను అని భవినా పేర్కొన్నారు. 


Updated Date - 2021-08-28T15:20:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising