ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo olympics: దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత అమ్మాయిలు

ABN, First Publish Date - 2021-07-31T16:57:48+05:30

విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన పూల్-ఏ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 4-3 తేడాతో గెలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవం

టోక్యో: విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన పూల్-ఏ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 4-3 తేడాతో గెలిచింది. భారత జట్టులో వందన కటారియా మూడు గోల్స్ చేసి భారత్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించింది. అలాగే నేహా ఒక గోల్ చేసింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి దక్షిణాఫ్రికా చివరి వరకు భారత్‌కు గట్టిపోటీ ఇచ్చింది. ఇక ఈ విజయంతో రాణిరాంపాల్ సారథ్యంలోని భారత జట్టు క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. కాగా, ఇవాళ సాయంత్రం ఐర్లాండ్, బ్రిటన్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం ఆధారంగా భారత్ క్వార్టర్ ఫైనల్ వెళ్లేది, లేనిది తెలిపోనుంది. ఇందులో బ్రిటన్‌ గెలిచినా లేదా మ్యాచ్‌ డ్రాగా ముగిసినా భారత్‌ క్వార్టర్ ఫైనల్‌కు వెళ్తుంది. ఒకవేళ ఐర్లాండ్ గెలిస్తే మాత్రం భారత జట్టు మూట సర్దుకోవాల్సిందే.            


Updated Date - 2021-07-31T16:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising