ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చరిత్ర సృష్టించేదెవరో?

ABN, First Publish Date - 2021-08-04T09:42:33+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో బుధవారం భారత్‌కు కీలకమైన రోజు. ఎందుకంటే బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌, మహిళల హాకీ జట్టుకు ఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యేది లేనిదీ తేలేది నేడే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  బాక్సర్‌  లవ్లీనా సెమీ్‌స, మహిళల హాకీ సెమీ్‌స  పోరు నేడే

టోక్యో ఒలింపిక్స్‌లో బుధవారం భారత్‌కు కీలకమైన రోజు. ఎందుకంటే బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌, మహిళల హాకీ జట్టుకు ఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యేది లేనిదీ తేలేది నేడే. 69 కిలోల విభాగంలో ఇప్పటికే సెమీస్‌ చేరి భారత్‌కు పతకం ఖాయం చేసిన అసోం అమ్మాయి లవ్లీనా ఫైనల్లో చోటు కోసం వరల్డ్‌ చాంపియన్‌, టర్కీకి చెందిన బుసానజ్‌ సుర్మెనిల్‌తో పోటీపడనుంది. ఈ పోరులో గెలిస్తే విశ్వక్రీడల్లో ఫైనల్‌ చేరిన తొలి భారత బాక్సర్‌గా లవ్లీనా చరిత్ర సృష్టిస్తుంది. గతంలో భారత బాక్సర్లు విజేందర్‌ సింగ్‌, మేరీకోమ్‌ కాంస్యాలు సాధించారు.




హాకీలో పురుషుల జట్టు స్వర్ణ పతకానికి దూరమవడంతో.. ఇప్పుడు ఆశలన్నీ అమ్మాయిలపైనే. మూడుసార్లు ఒలింపిక్‌ విజేత ఆస్ట్రేలియాను చిత్తుచేసి విశ్వక్రీడల్లో తొలిసారి సెమీస్‌ చేరిన రాణీ రాంపాల్‌ బృందం ఫైనల్‌ బెర్త్‌ కోసం ప్రపంచ రెండో ర్యాంకర్‌ అర్జెంటీనాను ఢీకొననుంది. ఆసీ్‌సపై గెలిచిన జోష్‌లో అర్జెంటీనాపైనా చెలరేగితే భారత హాకీ అమ్మాయిలు నవ చరిత్రకు నాంది పలికినట్లే. 


Updated Date - 2021-08-04T09:42:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising