ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympics: టోక్యో చేరుకున్న భారత షూటింగ్ జట్టు

ABN, First Publish Date - 2021-07-18T00:05:21+05:30

ప్రపంచ క్రీడా సంబంరంగా పిలిచే ఒలింపిక్ గేమ్స్ ఈ నెల 23 నుంచి జపాన్ రాజధాని టోక్యోలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచ క్రీడా సంబంరంగా పిలిచే ఒలింపిక్ గేమ్స్ ఈ నెల 23 నుంచి జపాన్ రాజధాని టోక్యోలో ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో పాల్గొనే భారత షూటింగ్ జట్టు నేడు టోక్యో చేరుకుంది. కొవిడ్ పరీక్షల కోసం వారి నుంచి నమూనాలు తీసుకున్న అధికారులు వాటిని పరీక్షలకు పంపారు. క్రొయేషియాలోని జాగ్రెబ్ బేస్ నుంచి నిన్న భారత షూటింగ్ జట్టు ఆమ్‌స్టెర్‌డామ్ చేరుకుంది. ఈ జట్టులో ప్రముఖ షూటర్లు అయిన సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, అంజుమ్ మౌద్గిల్ తదితరులు ఉన్నారు.


న్యూఢిల్లీ, క్రొయేషియాలలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో ఈ జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది. క్రియేషియాలో జరిగిన పోటీల్లో భారత్ తక్కువ పతకాలు గెలుచుకుంది. 52 మంది షూటర్లు పాల్గొనగా 14 పతకాలు మాత్రమే వచ్చాయి. కాగా, దీపిక కుమారి, అటనుదాస్‌లతో కూడిన భారత ఆర్చరీ బృందం టోక్యో బయలుదేరింది.  మొత్తం 18 క్రీడా విభాగాల్లో 126 మంది భారత క్రీడాకారులు పాల్గొంటారు. ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఇంత పెద్ద జట్టు వెళ్లడం ఇదే తొలిసారి.  

Updated Date - 2021-07-18T00:05:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising