ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒలింపిక్స్‌లో 13 ఏళ్ల తరువాత ‘జనగనణమన’

ABN, First Publish Date - 2021-08-08T10:02:48+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచి భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 121 ఏళ్ల భారత చరిత్రలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచి భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 121 ఏళ్ల భారత చరిత్రలో అథ్లెటిక్స్‌లో బంగారం అందించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. ఈ స్వర్ణంతో ఏళ్ల నాటి భారతీయుల కలను నిజం చేశాడు. ఈ క్రమంలోనే 13 ఏళ్ల తరువాత విశ్వక్రీడల వేదికపై భారత జాతీయ గీతం ఆలాపన జరిగింది. ఎప్పుడో 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అభినవ్ బింద్రా బంగారు పతకం నెగ్గిన సమయంలో ఒలింపిక్స్ వేదికపై వినపడిన భారత జాతీయ గీతం ఇన్నేళ్ల తరువాత మళ్లీ వినపడింది. 130 కోట్ల మంది భారతీయుల హృదయం ఆనందంతో ఉప్పొంగేలా చేసింది. నీరజ్ చోప్రాకు బంగారు పతకం అందించిన సమయంలో జాతీయ గీతం ఆలాపన జరుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


కాగా.. శనివారం జరిగిన జావెలిన్ త్రో పోటీల్లో నీరజ్ చోప్రా తొలుత 87.03, ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 87.58 మీట్ల దూరం జావెలిన్ విసిరి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఇక రెండో స్థానంలో నిలిచిన చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్‌ వద్లెచ్‌(86.67మీ) రజతం, మూడో స్థానంలో వితెస్లావ్‌ వెస్లే(85.44మీ) నిలిచి కాంస్యం గెలుచుకున్నారు.



Updated Date - 2021-08-08T10:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising