ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Olympics: పతకం దిశగా భారత గోల్ఫర్.. చరిత్రకు అడుగు దూరంలో..

ABN, First Publish Date - 2021-08-06T19:11:07+05:30

ఒలింపిక్స్‌లో భారత గోల్ఫ్ క్రీడాకారిణి​ అదితి అశోక్​ ఎవరూ ఊహించని విధంగా పతకం సాధించే దిశగా దూసుకెళ్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత గోల్ఫ్ క్రీడాకారిణి​ అదితి అశోక్​ ఎవరూ ఊహించని విధంగా పతకం సాధించే దిశగా దూసుకెళ్తోంది. తాజాగా ఆమె ఫైనల్‌కు చేరింది. మూడు రౌండ్లు ముగిసేసరి అదితి రెండో స్థానంలో నిలిచింది. అసలు ఈ విభాగంలో భారత్ రాణించడం కూడా ఇదే తొలిసారి. శుక్రవారం మహిళల వ్యక్తిగత స్ట్రోక్​ ప్లే రౌండ్​ 3లో రెండో స్థానంలో నిలిచిన అదితికి ఈ ఈవెంట్​లో రజతం సాధించే అవకాశముంది. 60 మంది పోటీపడుతున్న ఈ క్రీడలో మూడో రౌండ్‌ ముగిసేసరికి అదితి 201 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.


అమెరికాకు చెందిన నెల్లి కొర్డా 198 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంటే.. హన్నా గ్రీన్​(ఆస్ట్రేలియా), లైడియా(న్యూజిలాండ్​) 203 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నారు. ఈ గోల్ఫ్ ఈవెంట్‌లో ఎవరైతే తక్కువ పాయింట్లు సాధిస్తారో వారే మొదటి స్థానంలో ఉంటారు. కాగా, శుక్రవారం జరగాల్సిన రౌండ్​ 4 వాతావరణం అనుకూలించకపోవడంతో శనివారానికి వాయిదా పడింది.


ఒకవేళ శనివారం కూడా పోటీలు​ జరగకపోతే ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అదితికి​ రజతం ఖాయం అవుతుంది. ఒకవేళ పోటీలు జరిగిన అదితికి కాంస్యం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే జరిగితే ఒలింపిక్స్​లో పతకం సాధించిన తొలి భారత గోల్ఫర్​గా అదితి అశోక్ చరిత్ర సృష్టిస్తుంది. కనుక అదితి చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఉంది.  

Updated Date - 2021-08-06T19:11:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising