ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేవరెట్‌ సింధు

ABN, First Publish Date - 2021-10-19T07:42:39+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన తర్వాత కొన్నాళ్లు విరామం తీసుకున్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు మళ్లీ కోర్టులోకి అడుగుపెడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటినుంచి డెన్మార్క్‌ ఓపెన్‌

ఓడెన్స్‌: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన తర్వాత కొన్నాళ్లు విరామం తీసుకున్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు మళ్లీ కోర్టులోకి అడుగుపెడుతోంది. మంగళవారం నుంచి జరిగే డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 1000 టోర్నమెంట్‌లో ఫేవరెట్‌గా పోటీపడుతోంది. మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడింగ్‌ దక్కించుకున్న సింధు తొలి మ్యాచ్‌ను నెస్లిహాన్‌ (టర్కీ)తో ఆడనుంది. మరోవైపు సీనియర్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఆరంభరౌండ్లో జపాన్‌ షట్లర్‌ అయా ఒహొరిని ఢీకొననుంది. ఇక డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మొదటిరౌండ్లో ఇంగ్లండ్‌ జంట కాలమ్‌ హెమ్మింగ్‌-స్టీవెన్‌ స్టాల్‌వుడ్‌తో ఏడోసీడ్‌ సాత్విక్‌ ద్వయం తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో యువ కెరటం లక్ష్యసేన్‌, సౌరభ్‌ వర్మ, సీనియర్లు కిడాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌, పారుపల్లి కశ్యప్‌, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని, మేఘన-పూర్వీషా రామ్‌ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

Updated Date - 2021-10-19T07:42:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising