ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ విజేత ఎవరో చెప్పేసిన ఆసీస్ కెప్టెన్

ABN, First Publish Date - 2021-06-16T01:40:17+05:30

న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్ విజయం సాధిస్తుందని ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ జోస్యం చెప్పాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్ విజయం సాధిస్తుందని ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ జోస్యం చెప్పాడు. ఈ నెల 18న సౌతాంప్టన్‌లోని రోజ్‌బౌల్‌లో ఫైనల్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత భారత జట్టేనన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని పైన్ తేల్చి చెప్పాడు. అత్యుత్తమ జట్టుతో కనుక భారత్ బరిలోకి దిగితే దానిని ఆపడం సాధ్యం కాదని అన్నాడు.


ఓవైపు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఓ జట్టును, శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు మరో జట్టును భారత్ పంపడంపై పైన్ స్పందిస్తూ భారత్‌లాగే తాము కూడా జట్టును మరింత బలంగా తీర్చుదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. భారత జట్టును సమతూకంగా బ్యాలెన్స్ చేస్తున్నారని ప్రశంసించాడు. వాళ్లకు నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారని, తాము కూడా ఆ స్థితికి చేరుకోవాల్సి ఉందని పైన్ పేర్కొన్నాడు.


ఈ స్థితికి చేరుకుంటే కనుక కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తే వారు తిరిగి జట్టులోకి వచ్చాక మరింత బాగా రాణిస్తారని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా త్వరలో విండీస్‌లో పర్యటించనుంది. అయితే, కీలక ఆటగాళ్లు అయిన స్మిత్, వార్నర్, కమిన్స్, మాక్స్‌వెల్, స్టోయినిస్, రిచర్డ్‌సన్ వంటి వాళ్లు దూరమయ్యే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పైన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Updated Date - 2021-06-16T01:40:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising