ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌పై పాక్ మ్యాచ్ గెలిచాక బాణాసంచా కాల్చిన వారిపై కేసులు

ABN, First Publish Date - 2021-10-27T23:50:39+05:30

లక్నో: టీ 20 వరల్డ్ కప్ పోటీల్లో భారత్‌పై పాక్ మ్యాచ్ గెలిచాక బాణాసంచా కాల్చిన వారిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: టీ 20 వరల్డ్ కప్ పోటీల్లో భారత్‌పై పాక్ మ్యాచ్ గెలిచాక బాణాసంచా కాల్చిన వారిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఆగ్రా, బరేలీ, బదాయూ, సీతాపూర్‌లో కేసులు నమోదు చేశారు. మొత్తం ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. పాకిస్థాన్‌కు మద్దతుగా సంబరాలు చేసుకున్న మరింతమందిపై కేసులు నమోదు చేసేందుకు యోగి ప్రభుత్వం సన్నద్ధమౌతోంది.  


అంతేకాదు భారత్‌పై పాకిస్థాన్ జట్టు విజయంపై సంబరాలు చేసుకున్న ముగ్గురు కశ్మీరీ విద్యార్థులను ఇప్పటికే కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురూ పాకిస్థాన్ అనుకూల నినాదాలు కూడా చేశారు. ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే కళాశాల నిర్వాహకులు ముగ్గురు విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. మూడో సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి అర్షద్ యూసుఫ్, నాలుగో సంవత్సరం విద్యార్థులు ఇనాయత్ అల్తాఫ్ షేక్, షౌకత్ అహ్మద్ గనాయ్‌లను సస్పెండ్ చేసినట్లు ఆర్‌బీఎస్ ఇంజినీరింగ్ డీన్ దుష్యంత్ సింగ్ తెలిపారు. 

Updated Date - 2021-10-27T23:50:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising