ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్ దూకుడుకు శాంట్నర్ అడ్డుకట్ట.. వెంటవెంటనే మూడు వికెట్లు డౌన్

ABN, First Publish Date - 2021-11-22T01:23:59+05:30

న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో భారత్ వడివడిగా వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో భారత్ వడివడిగా వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ చెలరేగిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే బ్యాట్‌తో వీరంగం వేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు.


మరోవైపు, ఇషాన్ కిషన్ కూడా ఏమాత్రం తగ్గలేదు. అయితే, వీరి దూకుడుకు 69 పరుగుల వద్ద బ్రేక్ పడింది. 21 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసిన కిషన్ శాంట్నర్ బౌలింగులో సీఫెర్ట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.


ఆ తర్వాత రెండు పరుగులకే సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ కూడా శాంట్నర్‌‌కే దొరికిపోయాడు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లూ అతడి ఖాతాలోకే చేరడం గమనార్హం. ప్రస్తుతం పది ఓవర్లు ముగిశాయి. ఇండియా మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. రోహిత్ 48, శ్రేయాస్ అయ్యర్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-11-22T01:23:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising