ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లంచ్‌బ్రేక్‌కు ముందు భారత్‌కు మరో ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2021-08-25T23:15:55+05:30

ఇంగ్లండ్‌తో ఇక్కడి హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టును కష్టాలు వెంటాడుతున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లీడ్స్: ఇంగ్లండ్‌తో ఇక్కడి హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టును కష్టాలు వెంటాడుతున్నాయి. తొలుత నిప్పులు చెరిగే బంతులతో రాహుల్, పుజారా, కోహ్లీని జేమ్స్ అండర్సన్ పెవిలియన్ బాట పట్టించగా, లంచ్‌కు ముందు అజింక్య రహానేను రాబిన్సన్ అవుట్ చేశాడు. రహేనే కూడా వికెట్ల వెనక బట్లర్‌కే దొరికిపోవడం గమనార్హం.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి ఓవర్‌లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ (0)ను వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. రాహుల్‌ను అవుట్ చేసిన ఊపులో ఉన్న జేమ్స్ అండర్సన్ ఆ తర్వాత పుజారా (1), కెప్టెన్ కోహ్లీ (7)ని కూడా పెవిలిన్ చేర్చాడు. విరాట్ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన రహానేతో కలిసి రోహిత్ శర్మ నిదానంగా ఆడుతూ వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు.


ఇద్దరూ కలిసి సమయోచితంగా ఆడారు. 18 పరుగులు చేసిన రహానే క్రీజులో కుదురుకున్నట్టుగానే కనిపించాడు. అయితే, అంతలోనే రాబిన్సన్‌కు చిక్కి వికెట్ సమర్పించుకున్నాడు.  ప్రస్తుతం భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది.

Updated Date - 2021-08-25T23:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising