ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వార్టర్స్‌లో భారత్‌

ABN, First Publish Date - 2021-10-13T06:51:32+05:30

ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత మహిళల జట్టు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. సీనియర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు టోర్నీకి దూరమైనా భారత టీనేజర్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్హస్‌ (డెన్మార్క్‌): ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత మహిళల జట్టు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. సీనియర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు టోర్నీకి దూరమైనా భారత టీనేజర్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. మంగళవారం జరిగిన గ్రూప్‌-బి మ్యాచ్‌లో టీమిండియా 4-1 స్కోరుతో స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో మాళవిక బాన్సోడ్‌ 13-21, 9-21తో క్రిస్టీ గిల్మోర్‌ చేతిలో ఓడింది. అయితే రెండో సింగిల్స్‌లో అదితి భట్‌ 21-14, 21-8తో రేచల్‌ సుగ్డెన్‌పై గెలుపొంది 1-1తో స్కోరు సమం చేసింది. తర్వాత తొలి డబుల్స్‌లో తనీషా క్రాస్టో-రుతుపర్ణా పాండా జోడీ 21-11, 21-8తో జూలీ మ్యాక్‌పర్సన్‌-సియారా టోరెన్స్‌ జంటను ఓడించడంతో భారత్‌ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. మూడో సింగిల్స్‌లో తస్నిమ్‌ మీర్‌ 21-15, 21-6తో లారెన్‌ మిడిల్టన్‌పై గెలిచింది. ఆఖరి, రెండో డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-త్రిషా జోలీ జంట 21-8, 19-21, 21-10తో క్రిస్టీ గిల్మోర్‌-ఎలియనోర్‌ ఓడోనెల్‌ ద్వయంపై నెగ్గడంతో భారత్‌ 4-1తో మ్యాచ్‌ను ముగించింది. బుధవారం జరగనున్న చివరి గ్రూప్‌-బి మ్యాచ్‌లో పటిష్ట థాయ్‌లాండ్‌తో టీమిండియా తలపడనుంది. 

Updated Date - 2021-10-13T06:51:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising