ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి టీమిండియా

ABN, First Publish Date - 2021-01-19T22:41:16+05:30

టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అజింక్య రహానే సారథ్యంలోని యువజట్టు అద్భుత పోరాట పటిమతో పటిష్ట ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. గబ్బాలో నేడు ముగిసిన నాలుగో టెస్టు తర్వాత తాజా టెస్టు ర్యాంకింగ్స్‌ను ఐసీసీ విడుదల చేసింది.


117.65 రేటింగ్ పాయింట్లతో భారత జట్టు రెండో స్థానానికి ఎగబాకగా, ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 113 పాయింట్లతో మూడో స్థానానికి దిగజారింది. 118.44 పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఇంగ్లండ్ (106), దక్షిణాఫ్రికా (96), శ్రీలంక (86), పాకిస్థాన్ (82), వెస్టిండీస్ (77), బంగ్లాదేశ్ (55) ఉన్నాయి.

 

Updated Date - 2021-01-19T22:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising