ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భువనేశ్వర్ కుమార్ ఉంటే మరోలా ఉండేది: ఆకాశ్ చోప్రా

ABN, First Publish Date - 2021-06-22T22:27:51+05:30

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో పేసర్ భువనేశ్వర్ కుమార్ ఉండి ఉంటే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో పేసర్ భువనేశ్వర్ కుమార్ ఉండి ఉంటే భారత జట్టు పరిస్థితి మరోలా ఉండేదని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. అతడితో జట్టుకు ఎప్పుడూ మూడు ప్రయోజనాలు ఉంటాయన్నాడు. కొత్త బంతితో అతడు మ్యాజిక్ చేయగలడని, రెండోది ఎక్కువ ఓవర్లు వేయగలుగుతాడని పేర్కొన్నాడు. చివరిగా బ్యాటింగ్ చూడా చక్కగా చేయగలుగుతాడని చోప్రా వివరించాడు. మహ్మద్ షమీ, బుమ్రాలు సీమ్ బౌలర్లు అని, వారు బంతిని స్వింగ్ చేయలేరని చోప్రా వివరించాడు. భువీ  లేకపోవడం జట్టుకు లోటేనని అన్నాడు.


పలువురు మాజీ క్రికెటర్లు కూడా భువనేశ్వర్‌కు జట్టులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. కాగా, డబ్ల్యూటీసీ పైనల్‌కు ఆది నుంచి అవాంతరాలే ఎదురుతున్నాయి. టాస్ పడకుండానే తొలి రోజు ఆట రద్దు కాగా రెండో రోజు, మూడో రోజు ఆట కొనసాగింది. నాలుగో రోజు ఆటను కూడా వర్షం పూర్తిగా తుడిచిపెట్టేసింది. నేడు కూడా వర్షం కారణంగా ఆట కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. భారత్ తన తొలి ఇన్సింగ్స్‌లో 217 పరుగులు చేసింది. కివీస్ ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 104 పరుగులు వెనకబడి ఉంది. విలియమ్సన్ 14, టేలర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-06-22T22:27:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising