ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు వారాలు మీ ఇష్టం

ABN, First Publish Date - 2021-06-09T06:02:23+05:30

న్యూజిలాండ్‌తో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిశాక భారత జట్టుకు మూడు వారాల బ్రేక్‌ లభించనుంది. ఈనెల 18 నుంచి 22 వరకు జరిగే ఈ టెస్టు ముగిశాక ఇంగ్లండ్‌తో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బబుల్‌ బయట 20 రోజులుండొచ్చు
  • భారత క్రికెటర్లకు ఊరట

లండన్‌: న్యూజిలాండ్‌తో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిశాక భారత జట్టుకు మూడు వారాల బ్రేక్‌ లభించనుంది. ఈనెల 18 నుంచి 22 వరకు జరిగే ఈ టెస్టు ముగిశాక ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం ఏకంగా ఆరు వారాలపాటు వేచి చూడాల్సి వస్తోంది. దీంతో అంతకాలం బయో బబులో హోటల్‌ గదులకే పరిమితమైతే ఆటగాళ్లు మానసికంగా ఇబ్బందికర పరిస్థితి ఎదురుకుంటారనే ఆందోళన నెలకొంది. అందుకే కోహ్లీ సేనకు బీసీసీఐ 20 రోజుల పాటు విరామమిచ్చింది. ఈ సమయంలో ఎవరికి వారు తమ కుటుంబ సభ్యులతో ఇంగ్లండ్‌లో ఎక్కడైనా విహరించవచ్చు. అక్కడి పర్యాటక స్థలాలతో పాటు స్నేహితులను, శ్రేయోభిలాషులను కలుసుకోవచ్చు. ఇంగ్లండ్‌తో కఠిన సిరీస్‌ కోసం వారంతా తాజాగా ఉండేందుకు ఈ బ్రేక్‌ లాభిస్తుందని బోర్డు భావిస్తోంది. తిరిగి జూలై 14న క్రికెటర్లంతా జట్టులో చేరి టెస్టు సిరీస్‌ కోసం ప్రాక్టీస్‌ ఆరంభిస్తారు. ఇంగ్లండ్‌ టూర్‌కు వెళ్లడానికి ముందే కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి ఈ విరామం గురించి చూచాయగా చెప్పారు.


Updated Date - 2021-06-09T06:02:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising