ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Olympics: కాంస్య పతక విజయంతో భారత జట్టు మరో రికార్డ్!

ABN, First Publish Date - 2021-08-05T17:36:32+05:30

ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కాంస్య పతకాన్ని ముద్దాడింది టీమిండియా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కాంస్య పతకాన్ని ముద్దాడింది టీమిండియా. దీంతో భారత జట్టుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇక ఈ విజయంతో భారత హాకీ జట్టు మరో రికార్డు సృష్టించింది. పురుషుల హాకీలో అత్యధిక పతకాలు గెలిచిన జట్టుగా నిలిచింది. భారత్ ఇప్పటివరకు మొత్తం 12 పతకాలు(8 స్వర్ణాలు, ఒక రజతం, 3 కాంస్యాలు) గెలిచింది. ఇంతకుముందు జర్మనీ 11 పతకాలతో(4 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు) భారత్ కంటే ముందుంది. కానీ, గురువారం జర్మనీనే ఓడించిన భారత జట్టు.. పతకాల పరంగాను ఆ దేశాన్ని వెనక్కి నెట్టింది. కాగా, 1980లో మాస్కో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చివరిసారిగా స్వర్ణం గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క పతకం కూడా గెలవలేదు. ఈ కాంస్య పతకం విజయంతో 41 ఏళ్ల నిరీక్షణకు తెర పడినట్లైంది.    

Updated Date - 2021-08-05T17:36:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising