ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs Sri Lanka: భారత్‌ను కట్టడి చేసిన శ్రీలంక బౌలర్లు

ABN, First Publish Date - 2021-07-24T01:38:26+05:30

శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ 225 పరుగులకు ఆలౌటైంది. వర్షంతో ఆటకు అంతరాయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ 225 పరుగులకు ఆలౌటైంది. వర్షంతో ఆటకు అంతరాయం ఏర్పడకముందు వరకు బ్రహ్మాండగా సాగిన భారత బ్యాటింగ్ ఆ తర్వాత కుప్పకూలింది. వరుస పెట్టి వికెట్లు కోల్పోయింది.


మరోవైపు, శ్రీలంక బౌలర్లు అకిల దనంజయ, ప్రవీణ్ జయవిక్రమ చమీరలు భారత బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. పోటీలు పడి వికెట్లు తీస్తూ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. వీరి దెబ్బకు భారత స్కోరు 200 దాటడం కూడా కష్టమేనని భావించారు. అయితే, చివర్లో రాహుల్ చాహర్ (13), నవదీప్ సైనీ (15)లు కాసేపు ఎదురొడ్డారు. ఒక్క పరుగు తేడాతో వీరిద్దరూ ఔట్ కావడంతో 43.1 ఓవర్ వద్ద భారత ఇన్సింగ్స్ ముగిసింది. 


భారత బ్యాట్స్‌మన్లలో పృథ్వీషా (49), సంజు శాంసన్ (46), సూర్యకుమార్ యాదవ్ (40) ఆకట్టుకున్నారు. కెప్టెన్ శిఖర్ ధవన్ (13), హార్దిక్ పాండ్యా (19), మనీష్ పాండే (11) దారుణంగా విఫలమయ్యారు. కొత్త కుర్రాళ్లు నితీశ్ రాణా (7), కృష్ణప్ప గౌతమ్ (2), రాహుల్ చాహర్ (13) ఆకట్టుకోలేకపోయారు. 


శ్రీలంక బౌలర్లలో అకిల దనంజయ, జయవిక్రమ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, చమీర రెండు, కరుణరత్నె, దాసున్ శనక చెరో వికెట్ తీసుకున్నారు. కాగా, వర్షం కారణంగా మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు.

Updated Date - 2021-07-24T01:38:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising