ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దండి

ABN, First Publish Date - 2021-06-24T08:30:17+05:30

ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్రీడా విశ్వవిద్యాలయాన్ని అత్యుత్తమ క్రీడాకారులతో దేశానికే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రీడా వర్సిటీ వీసీ మల్లీశ్వరితో కేజ్రీవాల్‌


న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్రీడా విశ్వవిద్యాలయాన్ని  అత్యుత్తమ క్రీడాకారులతో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆ వర్సిటీకి తొలి వైస్‌ చాన్స్‌లర్‌గా నియమితులైన కరణం మల్లీశ్వరికి  సూచించారు. మల్లీశ్వరి బుధవారం ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ ఏర్పాటు, దాని లక్ష్యాలను అధిగమించేందుకు తీసుకోవలసిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికలపై చర్చించారు. క్రీడాకారుల కోసం తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న విశ్వవిద్యాలయం కల సాకారమైందని ట్వీట్‌ చేశారు.  


ఏపీలో అకాడమీ పెట్టాలని..

ఆంధ్రప్రదేశ్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌ అకాడమీ పెట్టాలని భావిస్తున్నట్టు మల్లీశ్వరి చెప్పింది. తెలుగు రాష్ర్టాల్లో అకాడమీ ఏర్పాటు చేసే విషయమై 20 ఏళ్లుగా ప్రయత్నిసున్నా, ముందుకు సాగడంలేదని చెప్పుకొచ్చింది. 

Updated Date - 2021-06-24T08:30:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising