ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరాజ్‌పై స్టోక్స్ స్లెడ్జింగ్.. కోహ్లీ రావడంతో..

ABN, First Publish Date - 2021-03-05T03:15:30+05:30

నాలుగో టెస్టు మొదటి రోజే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. భారత పేసర్ సిరాజ్‌పై స్టోక్స్ నోరు పారేసుకోవడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: నాలుగో టెస్టు మొదటి రోజే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. భారత పేసర్ సిరాజ్‌పై స్టోక్స్ నోరు పారేసుకోవడంతో రంగంలోకి దిగిన కోహ్లీ అతడికి గట్టి జవాబిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొతేరా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా 12వ ఓవర్‌ వేస్తున్న సమయంలో  ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్ తొలి బంతికే ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను పెవిలియన్‌కు పంపిన సిరాజ్.. ఈ మ్యాచ్‌లో మొదటి వికెట్‌‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 


ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన స్టోక్స్‌కు కూడా బ్యాట్ ఝుళిపించేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పదునైన బంతులతో ఇబ్బంది పెట్టాడు. వరుసగా మూడు బంతులను ఆడలేకపోవడంతో స్టోక్స్ అసహనానికి గురయ్యాడు. అదే సమయంలో ఓ భారీ బౌన్సర్ వేసిన సిరాజ్.. స్టోక్స్ వైపు ఓ ఇంటెన్సివ్ లుక్ ఇచ్చాడు. దీంతో స్టోక్స్ ఏకంగా తన నోటికి పని చెప్పాడు. దురుసు పదజాలంతో సిరాజ్‌ను దూషించాడు. ఈ విషయాన్ని సిరాజ్‌ నేరుగా కోహ్లీకి చెప్పడంతో అతడు స్టోక్స్‌కు తనదైన స్టైల్లో సమాధానమిచ్చి నోరుమూయించాడు.


దీనిపై సిరాజ్ మాట్లాడుతూ.. ‘బౌలింగ్‌ చేసిది ఆస్ట్రేలియాలోనైనా భారత్‌లోనైనా 100% శ్రమించడం నా నైజం. బాగా బౌలింగ్‌ చేయాలని ప్రతి బంతికీ నాకు నేనే చెప్పుకుంటాను. బెన్‌స్టోక్స్‌ నాపై దురుసుగా మాట్లాడాడు. విషయం విరాట్‌ భాయ్‌కు చెప్పాను. ఆ తర్వాత అతడు చూసుకున్నాడు’ అని సిరాజ్‌ అన్నాడు. ఇదిలా ఉంటే ఇంగ్లండ్ మునుపటిలానే ఈ  మ్యాచ్‌లో కూడా పేలవ ప్రదర్శనే చేసింది. 75.5 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆటముగిసే సమయానికి 24/1తో నిలిచింది.



Updated Date - 2021-03-05T03:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising