ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హార్దిక్‌ పాండ్యా ఫిట్‌

ABN, First Publish Date - 2021-10-29T08:38:11+05:30

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు బరిలోకి దిగనున్నాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు కుడిభుజం నొప్పితో బాధపడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్‌: ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు బరిలోకి దిగనున్నాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు కుడిభుజం నొప్పితో బాధపడ్డాడు. ఆ వెంటనే అతడికి స్కానింగ్‌ తీయించారు. ఇప్పటికే అతను పూర్తిగా కోలుకున్నాడని, ముందు జాగ్రత్త కోసమే స్కానింగ్‌ తీయించామని బోర్డు అధికారి పేర్కొన్నాడు. మరోవైపు నెట్స్‌లో పాండ్యా బౌలింగ్‌ కూడా చేయడం జట్టుకు సానుకూలాంశం కానుంది.

వేలంలోకి పాండ్యా!: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న హార్దిక్‌ పాండ్యాను అట్టి పెట్టుకునేందుకు ఆ జట్టు సిద్ధంగా లేనట్టు సమాచారం. దీంతో అతను ఆటగాళ్ల వేలానికి అందుబాటులో ఉండనున్నాడు. కెప్టెన్‌ రోహిత్‌, బుమ్రా, పొలార్డ్‌లను మాత్రమే ఆ జట్టు రిటైన్‌ చేసుకోనుంది. ఒకవేళ నలుగురికి అవకాశం ఉంటే సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌లలో ఒకరిని అట్టి పెట్టుకోవచ్చు. కొంతకాలంగా బ్యాటింగ్‌లో ఫామ్‌ కోల్పోయిన హార్దిక్‌.. అటు బౌలింగ్‌కూ దూరమయ్యాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌ పది జట్లతో జరుగనుండడంతో ఈ ఏడాది డిసెంబరులో ఆటగాళ్ల  మెగా వేలం ఉంటుంది. ఇక రాబోయే రెండు కొత్త జట్లు కూడా వేలానికి ముందే ముగ్గురేసి కీలక క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు బీసీసీఐ అనుమతించనున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-10-29T08:38:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising