ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40వ పడిలోకి యువరాజ్ సింగ్.. శుభాకాంక్షల వెల్లువ

ABN, First Publish Date - 2021-12-12T23:36:57+05:30

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నేటితో 40వ పడిలో అడుగుపెట్టాడు. యువీ బర్త్‌డే జరుపుకుంటున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నేటితో 40వ పడిలో అడుగుపెట్టాడు. యువీ బర్త్‌డే జరుపుకుంటున్న వేళ శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తింది. సచిన్ టెండూల్కర్ మొదలు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.


అక్టోబరు 2000వ సంవత్సరంలో కెన్యాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కెరియర్‌లో మొత్తం 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 


2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలో యువరాజ్ సింగ్  సభ్యుడు. 2011 ప్రపంచకప్‌లో యువీ కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన యువరాజ్ దాదాపు అన్ని మ్యాచుల్లోనూ ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.


అలాగే, టీ20 తొలి ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకోవడంలోనూ యువరాజ్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు బంతులను సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. 2011 ప్రపంచకప్ తర్వాత కేన్సర్ బారినపడిన యువీ.. దానిపైనా సిక్సర్ల వర్షం కురిపించి మైదానం అవతలికి తరలించాడు. 


సచిన్ టెండూల్కర్: హ్యాపీ బర్త్ డే యువీ. మైదానంలోను, బయట నీతో కలిసి పంచుకున్న ఘడియలు మర్చిపోలేనివి. ఇలాంటివి మరిన్నింటి కోసం ఎదురుచూస్తున్నా. 


గౌతమ్ గంభీర్: మైదానం బయట కానీ, లోపల కానీ ఏదైనా చాలా సులభంగా కనిపించేలా చేస్తావు ప్రిన్స్. దేవుడు నీకు దీర్ఘాయువును, ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. 


సురేశ్ రైనా: హ్యాపీ బర్త్ డే యువీ పా.. ఆ భగవంతుడు నీకు విజయాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు.


కేఎల్ రాహుల్: ఎప్పటికీ వెనక్కి తగ్గొద్దని, దీనినీ విడిచిపెట్టొద్దని ఎంతోమందికి స్పూర్తినిచ్చిన నిర్భయ క్రికెటర్. హ్యాపీ బర్త్ డే పాజీ 


మహమ్మద్ కైఫ్: రజనీ సార్‌కి, నా ప్రియ మిత్రుడు యువరాజ్ సింగ్‌కు బర్త్ డే అంటే సాధారణ విషయం కాదు. వారు అద్భుతాలు చేసి నమ్మిస్తారు. లక్షలాదిమంది ముఖాల్లో నవ్వులు తెప్పిస్తారు. సోదరుడికి ప్రేమతో, సర్‌కి సెల్యూట్.


బీసీసీఐ: 402 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 11,778 పరుగులు, 148 వికెట్లు, 2007 టీ20 ప్రపంచకప్, 2011 ప్రపంచకప్ విన్నర్, హ్యాపీ బర్త్ డే యువరాజ్.

Updated Date - 2021-12-12T23:36:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising