ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వార్నర్ చాలా హుందాగా వ్యవహరించాడు: బ్రాడ్ హడిన్

ABN, First Publish Date - 2021-05-13T21:31:06+05:30

నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అవమానించినా, డేవిడ్ వార్నర్ మాత్రం చాలా హుందాగా వ్యవహరించాడని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అవమానించినా, డేవిడ్ వార్నర్ మాత్రం చాలా హుందాగా వ్యవహరించాడని ఆస్ట్రేలియా క్రికెటర్, ఎస్‌ఆర్‌హెచ్ కోచ్ బ్రాడ్ హడిన్ అన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా జెంటిల్మెన్‌లా వ్యవహరించాడని వార్నర్‌ను ప్రశంసించాడు. వరుస ఓటముల నేపథ్యంలో వార్నర్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం కేన్ విలియమ్సన్‌కు నాయకత్వాన్ని అప్పగించింది. 


అంతేకాదు వార్నర్‌ను తుది జట్టులో నుంచి కూడా తప్పించింది. అయినప్పటికీ వార్నర్ మాత్రం ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. దీని గురించి తాజాగా హడిన్ స్పందించాడు. `వరుస ఓటముల నేపథ్యంలో జట్టులో మార్పులు చేయాలని యాజమాన్యం భావించింది. ఈ విషయాన్ని వార్నర్ అర్థం చేసుకున్నాడు. తుది జట్టులో చోటు కోల్పోయి బెంచ్‌ మీద కూర్చోవాల్సి వచ్చినా తనేమీ బాధపడలేదు. కఠిన పరిస్థితులను అతడు డీల్‌ చేసిన విధానం అమోఘం. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో వార్నర్ ఒకడు. కచ్చితంగా అతడు మళ్లీ మునుపటి ఫామ్ అందుకుంటాడ`ని హడిన్ అన్నాడు. 

Updated Date - 2021-05-13T21:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising