ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బయో బబుల్‌ను మా క్రికెటర్లు నమ్మారు: గ్రేమ్ స్మిత్

ABN, First Publish Date - 2021-05-08T18:07:45+05:30

ఐపీఎల్-14 కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన బయో బబుల్ సురక్షితమైనదని దక్షిణాఫ్రికా క్రికెటర్లందరూ నమ్మారని ఆ దేశ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ చెప్పాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్-14 కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన బయో బబుల్ సురక్షితమైనదని దక్షిణాఫ్రికా క్రికెటర్లందరూ నమ్మారని ఆ దేశ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ చెప్పాడు. భారత్‌లో వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నప్పటికీ తమ ఆటగాళ్లెవరూ భయాందోళనలకు గురవలేదని చెప్పాడు. ఐపీఎల్-14 వాయిదా పడడంతో దక్షిణాఫ్రికాకు చెందిన 11 మంది క్రికెటర్లు తాజాగా స్వదేశానికి చేరుకున్నారు. 


ఈ సందర్భంగా గ్రేమ్ స్మిత్ ఐపీఎల్ బయో బబుల్ గురించి మాట్లాడాడు. `ఐపీఎల్ కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్ సురక్షితమైనదిగానే భావించాం. మా ఆటగాళ్లతో మాట్లాడినపుడు వారంతా ధైర్యంగానే ఉన్నారు. క్షేమంగా ఉన్నామని చెప్పారు. ఎప్పుడూ ప్రమాదకరమైనదిగా భావించలేదు. అయితే వైరస్ ఒకసారి బబుల్‌లోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. భారత్‌లో వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎక్కడున్నా ప్రమాదమే. ఏదేమైనా మా క్రికెటర్లను స్వదేశానికి పంపడానికి బీసీసీఐ తీసుకున్న చొరవ ప్రశంసనీయమ`ని స్మిత్ అన్నాడు.

Updated Date - 2021-05-08T18:07:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising