కోహ్లీ.. సచిన్‌కు ఫోన్ చేయి!
ABN, First Publish Date - 2021-08-27T09:25:15+05:30
కెప్టెన్ విరాట్ కోహ్లీ పదే పదే ఆఫ్ స్టంప్ ఆవలగా వెళ్లే బంతులకు అవుట్ అవుతుండడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు...
లీడ్స్: కెప్టెన్ విరాట్ కోహ్లీ పదే పదే ఆఫ్ స్టంప్ ఆవలగా వెళ్లే బంతులకు అవుట్ అవుతుండడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ‘కోహ్లీ వెంటనే సచిన్‌కు ఫోన్ చేసి తానెలా ఆడాలో అడగాలి. ఎందుకంటే అతడి బ్యాటింగ్ నాకు ఆందోళన కలిగిస్తోంది. బంతిని ఐదు, ఆరు, ఏడో స్టంప్‌నకు వేసినా అవుటవుతున్నాడు. 2014లో కేవలం ఆఫ్ స్టంప్ మీదుగా వెళ్లే బంతులకే అవుటయ్యేవాడు. అందుకే సిడ్నీలో సచిన్ ఎలా ఆడాడో తను నేర్చుకోవాలి. తానిక కవర్‌డ్రైవ్ ఆడబోనని చెప్పుకోవాలి’ అని గవాస్కర్ సలహా ఇచ్చాడు.
Updated Date - 2021-08-27T09:25:15+05:30 IST