ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంత బాధ్యరాహిత్యమా..! రోహిత్ శర్మపై గవాస్కర్ ఫైర్..

ABN, First Publish Date - 2021-01-16T21:56:18+05:30

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో రోహిత్ ఆట తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు పూర్తి బాధ్యరాహిత్యంగా ఆడాడని, ఫీల్డర్లను దృష్టిలో ఉంచుకుని బ్యాటింగ్ చేయాలన్న కనీస ఆలోచన కూడా లేకుండా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూడిల్లీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో రోహిత్ ఆట తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు పూర్తి బాధ్యరాహిత్యంగా ఆడాడని, ఫీల్డర్లను దృష్టిలో ఉంచుకుని బ్యాటింగ్ చేయాలన్న కనీస ఆలోచన కూడా లేకుండా రోహిత్ ఆడాడని మండిపడ్డారు. భారత్-ఆసీస్ సిరీస్‌ నేపథ్యంలో గవాస్కర్ ‘చానెల్‌ 7 క్రికెట్‌’ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మ్యాచ్‌లో రోహిత్ అవుట్ కాగానే గవాస్కర్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. హిట్‌మ్యాన్‌కు బాధ్యత లేకుండా ఆడాడని, లాంగాన్‌లో, స్క్వేర్‌ లెగ్‌లో ఫీల్డర్లు ఉన్నప్పుడు అలాంటి షాట్‌ ఆడాలని ఎలా అనుకుంటావంటూ రోహిత్‌ ఆట తీరును విమర్శించారు. అంతకుముందు లియాన్ బౌలింగ్‌లో చక్కటి ఫోర్లు కొట్టిన రోహిత్‌.. ఇలా చెత్త షాట్ ఆడి అవుటవుతాడని అనుకోలేదని, అసలు ఆ షాట్ ఎందుకు ఆడాడో కూడా అర్థం కావడం లేదని గవస్కర్‌ చెప్పుకొచ్చాడు.


ఇదిలా ఉంటే నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ మొత్తం 369 పరుగులు చేసింది. 274/5 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టు మరో 95 పరుగులు జోడించి ఆలౌటైంది. అనతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌ గిల్(7) రూపంలో తొలి వికెట్‌ను త్వరగా కోల్పోయింది. అయితే రోహిత్(44) చక్కగా ఆడుతున్నట్లు కనపడినా అనవసర షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరాడు.  ప్రస్తుతం క్రీజులో పుజారా, రహానే ఉన్నారు. అయితే టీ విరామం తరువాత వర్షం పడడంతో మూడో సెషన్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో 62/2 స్కోరుతో టీమిండియా రెండో రోజు ఆట ముగించింది.

Updated Date - 2021-01-16T21:56:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising