ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెప్టెన్సీ నుంచి కోహ్లీని అందుకే తొలగించాం.. పెదవి విప్పిన గంగూలీ

ABN, First Publish Date - 2021-12-10T02:54:36+05:30

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించడంపై దుమారం రేగుతుండడంతో బీసీసీఐ బాస్ సౌరవ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: టీమిండియా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించడంపై దుమారం రేగుతుండడంతో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఎట్టకేలకు పెదవి విప్పాడు. వైట్‌బాల్ ఫార్మాట్‌కు ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని సెలక్టర్లు భావించారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాడు.


టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లీని కోరినప్పటికీ టీ20 ప్రపంచకప్ తర్వాత కొనసాగేందుకు అతడు అంగీకరించలేదని గంగూలీ గుర్తు చేశాడు. కాబట్టి రెండు రెండు వైట్‌బాల్ ఫార్మాట్లకు ఇద్దరు వైట్ బాల్ కెప్టెన్లు అవసరం లేదని సెలక్టర్లు భావించారని గంగూలీ వివరించాడు. 


పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పలువురు కెప్టెన్లు ఉండడం వల్ల గందరగోళానికి దారితీస్తుందని గంగూలీ పేర్కొన్నాడు. అందుకనే.. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వన్డే, టీ20 జట్లు రెండింటికీ రోహిత్‌నే కెప్టెన్‌గా నియమించిందన్నాడు. అయితే, ఆ గందరగోళం ఏంటన్నది కానీ, అలా అని వారు ఎందుకు అనుకున్నారో కానీ తనకు తెలియదని గంగూలీ తేల్చి చెప్పాడు.  

Updated Date - 2021-12-10T02:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising